వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌‌గా నాగార్జున

Last Updated : Dec 8, 2017, 04:51 PM IST
వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌‌గా నాగార్జున

హీరో అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తారు. నాగ్ లాంటి దిగ్గజ నటుడు ఈ పనిచేయడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా.. దీన్నీ మీరు నమ్మి తీరాల్సిందే..ఎందుకంటే నాగ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అఖిల్ అప్ కమ్మింగ్ మూవీ 'హలో' గురించి మాట్లాడుతూ నాగ్ ఈ విషయాన్ని చెప్పారు.. కొడుకు కోసం ఆమాత్రం చేయలేనా అంటూ చిరునవ్వులు చిందించారు నాగ్.

అఖిల్ మొదటి సినిమాలో నాగార్జున కనిపించాడు. మరి అఖిల్ రెండో సినిమా హలోలో కూడా నాగ్ ఉన్నాడా.. ? ఉన్నాడంటూ మొన్నటివరకు పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో  తన పాత్ర ఏంటనే విషయంపై మీడియాతో ముచ్చటిస్తూ ఈ విషయాన్ని బయటపెట్టేశారు నాగ్.  ఆయన మాటల్లో చెప్పాంటే... “ఈ చిత్రానికి వాయిస్‌ ఓవర్ మాత్రమే ఇచ్చాను తప్ప నటించలేదు. సినిమా చూసి చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాను. పర్సనల్‌గా నేను చాలా హ్యాపీగా వున్నాను. ‘మనం’ ఎంటర్‌ప్రైజెస్‌తో నేను, చైతు, అఖిల్‌ ముగ్గురం సినిమాలు చేస్తాం. అందుకే సెంటిమెంట్‌ ప్రకారంగా ‘మనం’ అనేది ఎప్పుడు వుండాలని ఆ బేనర్‌ పెట్టాం.” హలో సినిమాకు సంబంధించి నాగ్ క్లారిఫికేషన్ ఇది.

Trending News