/telugu/photo-gallery/2024-karthika-pournami-wishes-for-your-family-and-friends-with-hd-photos-beautiful-messages-sd-180865 2024 Karthika Pournami Wishes: మీ  కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 2024 Karthika Pournami Wishes: మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 180865

అమరావతి: వ్యవసాయం చేసుకునే రైతులకు మొదటి దెబ్బ తీసేది నకిలీ విత్తనాలు ( Fake seeds ) అయితే.. రెండో దెబ్బ తీసేది నకిలి ఎరువులు ( Fake fertilizers ). నకిలీ విత్తనాలు, ఎరువులు, నకిలీ పురుగల మందులను నమ్ముకుని అప్పుల పాలైన కొంతమంది రైతులు.. ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యలు ( Farmers suicides ) చేసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా ఏపీ సర్కార్ ( AP govt ) తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని రైతులకు ఆ ఇబ్బందులు తప్పనున్నట్టు తెలుస్తోంది. ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ( YSR Agrilabs ) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయిలో 13, నియోజకవర్గాల స్థాయిలో 147, ప్రాంతీయ స్థాయిలో 4 వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల రైతులకు మేలు కలిగేలా విశాఖపట్టణం, గుంటూరు, ఏలూరు, తిరుపతి నగరాల్లో 4 ప్రాంతీయ ల్యాబ్స్ ఏర్పాటు కానున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నాణ్యతను ప‌రిశీలించేందుకు ఈ వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఉపయోగపడనున్నాయి. ( Also read: AP: కోవిడ్19 చికిత్సకు టాప్ ప్రయారిటీ )

వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటుకు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టును ఏపీ సర్కార్ నాబార్డుకు ( NABARD ) పంపించింది. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి కింద నాబార్డు  ఇప్ప‌టికే రూ.150 కోట్లు విడుదల చేసినట్టు సమాచారం. ఈ వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ అందుబాటులోకి వస్తే.. రైతులకు నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువుల సమస్య నుంచి శాశ్వత పరిష్కారం లభించనుందని ఏపీ సర్కార్ చెబుతోంది. ( Also read: #Watch: పురిటినొప్పులను మించిన కష్టం )

Section: 
English Title: 
YSR Agri labs in AP to test quality of seeds, pesticides and fertilizers: AP govt
News Source: 
Home Title: 

YSR Agri labs: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

YSR Agri labs: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
YSR Agri labs: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
Publish Later: 
Yes
Publish At: 
Friday, July 24, 2020 - 23:30