కోవిడ్ 19 వైరస్ చికిత్స ( Covid19 Treatment ) కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాప్ ప్రయారిటీ ఇస్తోంది. ఇప్పటికే కరోనా నిర్ధారణ పరీక్షల సామర్ధ్యాన్ని భారీగా పెంచిన ప్రభుత్వం ఇప్పుడు కరోనా చికిత్సపై దృష్టి సారించింది. కరోనా చికిత్స కోసం వేయి కోట్లను కేటాయించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ).
కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక కోవిడ్ సమీక్ష ( Covid Review ) నిర్వహించారు. కరోనా రోగుల చికిత్సకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికార్లను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా బాధితుల చికిత్స కోసం ఇప్పుడున్న ఆసుపత్రులకు అదనంగా మరో 54 ఆసుపత్రుల్ని ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్ ( Cm Jagan ) వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 138 ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఇవి కాకుండా అదనంగా మరో 5 ఆసుపత్రుల్లో క్రిటికల్ సేవలు అందించనున్నట్టు చెప్పారు. వచ్చే ఆరు నెలల కాలంలో కోవిడ్ చికిత్స ( Covid treatment ) కోసం వేయి కోట్లు ఖర్చు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ తెలిపారు. క్రిటికల్ కేర్ చికిత్సలో భాగంగా మరో 2 వేల 380 బెడ్స్ అందుబాటులో వస్తాయన్నారు. ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాలు, పారా మెడికల్ సిబ్బంది, వైద్యుల నియామకం, ఆరోగ్య సిబ్బంది కోసం భారీగా ఖర్చు చేయనున్నట్టు సీఎం స్పష్టం చేశారు. Also read: Vijayawada Lockdown: విజయవాడ లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చిన కలెక్టర్