టాలీవూడ్ హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్య

టాలీవూడ్ లో హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Last Updated : Dec 11, 2017, 05:44 PM IST
టాలీవూడ్ హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్య

టాలీవూడ్ లో హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూసఫ్ గూడ లో నివాసముంటున్న సాయి అతని అపార్ట్ మెంట్ లో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే కారణం అని సమాచారం. గత కొంతకాలంగా అతను తీవ్ర మనోవేదనలో ఉన్నట్లు అతని స్నేహితులు చెబుతున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడమూ కూడా ఇందుకు కారణం అని తెలుస్తోంది. అమ్మాయిలు-అబ్బాయిలు, బొమ్మరిల్లు, మంత్ర, అల్లరి, ధనలక్ష్మి తలుపు తడితే, ఒకరికి.. ఒకరు తదితర చిత్రాల్లో విజయ్ సాయి నటించారు.

Trending News