అనంతపురం: హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన ఆగ్రహాన్ని బయటపెట్టారు. ఇంటిటా తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా తన నియోజనవర్గంలో మంగళవారం బాలయ్య పర్యటించారు. ఈ సందర్భంలో ఓ కార్యకర్తపై ఆయన చేయిచేసుకున్నారు. తనను దాటుకుని ముందుకెళ్తున్నాడని ఆగ్రహంతో ఊగిపోయి అతని చెంప చెళ్లుమనిపించారు. గతంలో కూడా పలుమార్లు బాలకృష్ఱ అభిమానులపై చేయిచేసుకున్న విషయం విదితమే. తాజా ఘటనతో బాలయ్య మరోసారి వార్తల్లోకెక్కారు. కాగా ఈ ఘటనతో బాలయ్యపై ప్రతిపక్ష పార్టీలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. బాలయ్య అహంకార వైఖరి మరోసారి బహిర్గతమైందని వైసీపీ నేతలు ఆరోపణలు సంధింస్తున్నారు.
#CAUGHTONCAM: Telugu actor and TDP MLA N Balakrishna slaps a supporter during a door to door election campaign in Hindupur, Andhra Pradesh pic.twitter.com/FXE3QAUlAG
— ANI (@ANI) October 3, 2017
కార్యకర్త చెంపచెళ్లుమనిపించిన బాలయ్య