శిక్షణ తీసుకున్న కుక్కలు కొన్ని రకాల వ్యాధిగ్రస్తులను ఇట్టే పసిగట్టేస్తాయని తెలిసిందే. అయితే కరోనా వైరస్ వ్యాప్తి సమయంలోనూ ఇదే చేస్తే ప్రయోజనం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. శిక్షణ ఇచ్చిన కుక్కలు కోవిడ్19 లక్షణాలున్న వారిని గుర్తిస్తాయని తేలింది. ఈ నేపథ్యంలో దుబాయ్ ఎయిర్‌పోర్టు అధికారులు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చిన కుక్కలను ఉద్యోగాలలో నియమించాయి. భారత్ కోసం ధోనీ సాధించిన ఘనతలు, అందించిన ట్రోఫీలు
ఎయిర్‌పోర్టులో కోవిడ్19 అనుమానిత వ్యక్తులను ఇవి పసిగట్టనున్నాయి. దుబాయ్ జులై నెలలో టూరిస్ట్ ప్రాంతాలను తెరిచింది. పర్యాటకులను అనుమతిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా సోకిన వ్యక్తులను సులువుగా గుర్తించేందుకు దుబాయ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మనుషుల కన్నా ఇవి లక్షరెట్లు లక్షణాలు కనిపెట్టగలవని పరిశోధనలో గుర్తించారు. Allan Lichtman: 40 ఏళ్లుగా ఆయన జోస్యం నిజమైంది.. ఈసారి అమెరికా అధ్యక్షుడు ఎవరంటే!
దుబాయ్‌కి వెళ్లాలనుకున్న పర్యాటకులు ముందుగా కోవిడ్19 టెస్టులు చేయించుకుని నెగటివ్‌గా ఫలితం వస్తే రిపోర్టుతో తమ దేశంలోకి అనుమతించనున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వచ్చే నెల నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ సైతం ప్రారంభం కానుంది. యూఏఈలోని మూడు వేదికలలో దుబాయ్ ఒకటని తెలిసిందే. COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే
అందాలతో బుసలు కొడుతున్న ‘నాగిని’ Nia Sharma Hot Photos
Photos: అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..