సన్నిలియోన్ పై కన్నడిగుల ఆగ్రహం

బాలీవుడ్ హీరోయిన్‌గా మరియు ఒకప్పుడు పోర్న్ స్టార్‌గా ఘనతకెక్కిన సన్ని లియోన్ పై పలువురు కన్నడిగులు మండిపడ్డారు.

Last Updated : Dec 15, 2017, 03:32 PM IST
సన్నిలియోన్ పై కన్నడిగుల ఆగ్రహం

బాలీవుడ్ హీరోయిన్‌గా మరియు ఒకప్పుడు పోర్న్ స్టార్‌గా ఘనతకెక్కిన సన్ని లియోన్ పై పలువురు కన్నడిగులు మండిపడ్డారు. కర్ణాటక రక్షణ వేదిక యువసేన ఆధ్వర్యంలో రోడ్డు మీద బైఠాయించి కర్ణాటక రాష్ట్రంలో సన్ని లియోన్ అడుగుపెట్టకూడదని డిమాండ్ చేశారు. ఓ సంస్థ త్వరలో బెంగళూరులో జరగబోయే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సన్ని లియోన్‌తో ప్రదర్శనను ఏర్పాటు చేయాలని భావించడమే ఈ వివాదానికి కారణమైంది.

బెంగళూరులోని వైట్ ఆర్చిడ్ హోటల్‌లో "సన్ని నైట్ ఇన్ బెంగళూరు న్యూ ఇయర్ ఈవెంట్ 2018' పేరుతో త్వరలో ఒక కార్యక్రమాన్ని బెంగళూరులో నిర్వహించనున్నారు. అయితే కన్నడ సంప్రదాయ, సంస్కృతిని కాలరాసే విధంగా ఈ ఈవెంట్ ఉందని.. ఒక పోర్న్ స్టార్‌ని కన్నడ రాష్ట్రానికి తీసుకురావడానికి నిర్వాహకులకు ఎంత ధైర్యమని చెబుతూ కర్ణాటక రక్షణ వేదిక యువసేన ధర్నాకి దిగడం గమనార్హం. 

 

Trending News