ఆన్ లైన్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ ను ( WhatsApp ) ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్నారు. పలు రకాలుగా ఉపయోగపడే వాట్సాప్ లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు అప్డేట్ అవుతూ ఉంటాయి. త్వరలో మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నారట. ఇందులో ఒక్కో చాట్ కు ఒక్కో బ్యాగ్ గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చట. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ లో ఉంది అని.. బీటా వర్షన్ ( Beta Version ) యూజర్లుకూడా ప్రస్తుతం దీన్ని వినియోగించలేరు.
ఈ ఫీచర్ పై కొనసాగుతున్న టెస్టింగ్ పూర్తి అయితే వెంటనే అందుబాటులోకి తీసుకురానున్నారు అని సమాచారం. ముందు గా వీటిని బీటా వర్షన్ వినియోగదారులకు వినియోగించే అవకాశం ఇవ్వనున్నారు. v2.20.199.5 బీటా వర్షన్ లో అప్డేట్ చేయనున్నారు. వీటితో పాటు కొత్త రింగ్ టోన్స్, గ్రూపస్ కాల్స్, కాంటాక్ట్ షాట్ కట్స్, స్టికర్ యానిమేషన్ వంటి ఫీచర్లు కూడా అప్డేట్ చేయనున్నట్టు సమాచారం.