WhatsApp latest feature: వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను ( WhatsApp new features ) అందుబాటులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో కొత్త ఫీచర్లను అది టెస్ట్ చేస్తూ నిత్యం అపడేట్స్ పంపుతోంది. అదే కోవలో ఇప్పడు ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు వాట్సాప్ ఏర్పాట్లు చేసుకుంటోంది. వాట్సాప్ యూజర్లకు (WhatsApp Users ) ఇది నిజంగా శుభవార్తే. ముఖ్యంగా స్టికర్స్‌ను ఎక్కువగా వినియోగించే వారి కోసం మరిన్ని అపడేట్స్ తీసుకురావడానికి వాట్సాప్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఆండ్రాయిడ్ ( Android ), ఐఓఎస్ (iOS) వినియోగదారుల కోసం యానిమేటెడ్ స్టిక్కర్లను ( Animated Stickers ) తీసుకువచ్చే పనిలో వాట్సాప్ నిమగ్నమైంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌కు సంబంధించిన బీటా వర్షన్ మాత్రమే కొంత మంది వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఫైనల్ వర్షన్ విడుదలైతే చాటింగ్ మరింత ఆహ్లాదకరంగా మారనుంది.
కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లు ఈ యానిమేటెడ్ స్టిక్కర్లను ( Whatsapp stickers ) తమ కాంటాక్ట్స్‌కు పంపుకోవచ్చు. వాటిని రిసీవ్ చేసుకున్న వ్యక్తులు వాటిని చూడడంతో పాటు సేవ్ చేయడం లేదా ఇతరులకు సెండ్ చేయవచ్చు. మీకు కావాల్సిన స్టిక్కర్స్‌ను మీరు థర్డ్ పార్టీ యాప్ ( Third Party App ) నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ఇప్పుడు అందరికి అందుబాటులోకి తీసుకురాలేదు. సో.. మీ యాప్‌లో ఈ ఫీచర్ లేకపోతే మాత్రం నిరాశ చెందకండి. ఫైనల్ వర్షన్ అధికారికంగా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాట్సాప్ లేటెస్ట్ అప్‌డేట్ వచ్చే వరకు వేచిచూస్తే సరిపోతుంది.. ఇక చాటింగ్‌ని ఎంజాయ్ చేయడం మీ చేతుల్లోనే ఉంటుంది.