NTA NEET 2020 Today | నేడు దేశవ్యాప్తంగా జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET 2020) నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) సర్వం సిద్ధం చేసింది. నేటి (సెప్టెంబర్ 13న) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న నీట్ 2020 ఎగ్జామ్‌కు దేశవ్యాప్తంగా 15.97 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి 55వేలకు పైగా విద్యార్థులు ‘నీట్’కు హాజరుకానున్నారు. ఇది ఆఫ్‌లైన్ రాత పరీక్ష. కోవిడ్ నేపథ్యంలో కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారు. Remedies for Knee Pain: మోకాళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఇలా చేస్తే సరి
ఒక్కో గదికి కేవలం 12 మందిని కేటాయించారు. భౌతికదూరం ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన నీట్ ఎట్టకేలకు నేడు జరగనుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు, శానిటైజర్స్‌తో ఎగ్జామ్ సెంటర్లకు రావాలని సూచించారు. పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్‌ను అనుమతిస్తారు. అవసరమైతే చేతికి గ్లౌజులు ధరించినా అనుమతి ఉంది. ఎగ్జామ్ సెంటర్లో అభ్యర్థులకు మాస్కులు పంపిణీ చేస్తారు. అయితే హాల్ టికెట్‌తో పాటు పాన్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్టు లాంటి ఏదైనా ఓ గుర్తింపు కార్డుతో పరీక్ష కేంద్రాలకు రావాలని విద్యార్థులకు సూచించారు.
ఇవి మాత్రం చేయవద్దు...
పొడుగు చొక్కాలు ధరించ కూడదు. షూ (బూట్లు) ధరించి వచ్చిన అభ్యర్థులను లోనికి అనుమతించరు. చెప్పుడు మాత్రమే ధరించి రావాలి. మొబైల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు, చేతి గడియారాలు, ఏదైనా ఇతర లోహాల వస్తువులు వెంట తెచ్చుకుంటే ఎగ్జామ్ హాల్లోకి అనుమతించరు. Remedies for Piles: పైల్స్ సమస్యకు ఈ చిట్కాలు పాటించండి
ఫొటో గ్యాలరీలు
- Shivani Narayanan Photos: ట్రెడీషన్, మోడ్రన్ ఏదైనా సరే..
- Bigg Boss 4: అరియానా గ్లోరి ఫొటోలు
- Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR