హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన రోజు నేడు (సెప్టెంబర్ 17). 1947 ఆగస్టు 15న భారత్‌కు స్వాతంత్య్రం రాగా, తెలంగాణ సహా నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాజ్యానికి మాత్రం చీకటి రోజులు అలాగే ఉన్నాయి. దీంతో ఇక్కడి ప్రజల సమస్యను పరిష్కరించడంతో పాటు భారత యూనియన్‌లో హైదరాబాద్ రాజ్యాన్ని కలపేందుకు అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన ప్రయత్నాలు సెప్టెంబర్ 17, 1948న ఫలించాయి. నిజాం పాలనలోని తెలంగాణ సహా హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్‌లో కలిసిన రోజును బీజేపీ.. తెలంగాణ విమోచన దినం (Telangana Liberation Day)గా జరుపుతోంది. దీన్ని తెలంగాణ విలీన దినం, హైదరాబాద్ విమోచన దినం (Hyderabad Liberation Day) అని కూడా పిలుస్తారు. Telangana: 1000 దాటిన కరోనా మరణాలు
హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవం (తెలంగాణ విమోచన దినోత్సవం) సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు కె లక్ష్మణ్ సహా పలువురు బీజేపీ నేతలు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎంఐఎంతో దోస్తీ ఉన్న అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం ఇందుకు ససేమిరా అంటోంది.
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఇవాళ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు @drlaxmanbjp జాతీయ పతాకాన్ని ఎగరేశారు. నిజాం వ్యతిరేక పోరాటంలో అసమాన త్యాగాలు చేసిన నాటి సమరయోధులను స్మరించుకున్నారు. @RaoMlc @ShruthiBangaru#HyderabadMuktiSangram pic.twitter.com/TBes8ugzPU
— BJP Telangana (@BJP4Telangana) September 17, 2020
‘హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవం సందర్భంగా, శ్రీ సోయం బాపురావు, శ్రీ వివేక్ లతో కలిసి నా నివాసంలో భారత జాతీయ జెండాను ఆవిష్కరించాను. భారతదేశంలో విలీనం కోసం ఆనాడు మన ప్రజలు చేసిన పోరాటం చిరస్మరణీయమని’ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవం సందర్భంగా, శ్రీ సోయం బాపురావు, శ్రీ వివేక్ లతో కలిసి నా నివాసంలో భారత జాతీయ జెండాను ఆవిష్కరించాను.
భారతదేశంలో విలీనం కోసం ఆనాడు మన ప్రజలు చేసిన పోరాటం చిరస్మరణీయం.#HyderabadLiberationDay #TelanganaMuktiSangram pic.twitter.com/4jx5MzxfxB— G Kishan Reddy (@kishanreddybjp) September 17, 2020
ఫొటో గ్యాలరీలు
-
బిగ్‌బాస్ ఫైనలిస్ట్ Rashami Desai Hot Photos వైరల్
- Bigg Boss 4: అరియానా గ్లోరి ఫొటోలు
- Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR