ఆధునిక పోటీ ప్రపంచంలో ఎక్కువగా ఎదురయ్యే సమస్య కంటిచూపు ( Eye vision ) లేదా కంటికి సంబంధించిన పలు సమస్యలు. కాలుష్యం ప్రదాన కారణం. కంటికి సంబంధించిన సమస్యలకు సమాధానం తేనె అని తెలుసా..
శరీరానికి సంబంధించిన పలు అంతర్గత రుగ్మతలకు తేనె దివ్య ఔషధం ( Honey as best medicine ) గా పని చేస్తుందని అందరికీ తెలుసు. మరి కంటికి సంబంధించిన సమస్యలకు కూడా ఇదే తేనే పరిష్కారమని మీకు తెలుసా. ఔను నిజమే. కంటి చూపుకు, కంటికి సంబంధించి ఎదురయ్యే ఇబ్బందులకు తేనె ఓ పరిష్కారమార్గం. తేనె నాలుకకు రుచి మాత్రమే అందించదు. ఆరోగ్యానికి, చర్మానికి ప్రయోజనకారిగా..బరువు తగ్గించే ఔషధంగా ఉపయోపడుతుంది.
ఇక కంటికి సంబంధించి తేనె ఏ విధంగా ప్రయోజనకారో తెలుసుకుందాం. తేనె క్రమం తప్పకుండా వాడటం ద్వారా కంటిచూపు మెరుగుపడుతుంది. కంటివాపును తగ్గించడానికి అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. కళ్లలో చికాకు, మంటతో బాధపడుతుంటే...తేనె సరైన పరిష్కారం. కంటి వ్యాధులైన బ్లీఫరో కాన్జుంక్టివైటిస్, ఇన్ఫ్లమేటరీకు బాగా పనిచేస్తుంది. , ఇన్ల్ఫమేటరీలకు బాగా పనిచేస్తుంది.
పని నిమిత్తం గంటల తరబడి కంప్యూటర్ ముందు గానీ ల్యాప్ టాప్ ముందు గానీ కూర్చున్నప్పుడు కళ్లు అలసిపోతాయి. కనురెప్పల్ని మూసి..ఆ రెప్పలపై కొద్దిగా తేనె వేసి కాస్సేపు అలానే వదిలేయాలి. అరగంట తరువాత చల్లని నీటితో శుభ్రపర్చుకుంటే కళ్లు చాలా బాగా రీఫ్రెష్ ( Eye refresh ) అవుతాయి.
సాధారణంగా చర్మం ఎలా పొడిబారుతుంటుందే..కళ్లు కూడా అలానే పొడిబారుతుంటాయి. ఈ పరిస్థితుల్లో నొప్పి, దురద, కళ్లు ఎర్రబడటం, దృష్టి మసకగా ఉండటం వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఈ సమస్య ఉన్నప్పుడు తేనె, గోరువెచ్చని నీటితో ఐ వాష్ చేసుకుని దాంతో..కళ్లను కడుక్కోవాలి. రాత్రి నిద్రకు ముందు ఇలా చేస్తే ఫలితం బాగుంటుంది.
వయస్సు పెరిగే కొద్దీ కంటి చూపు మందగిస్తుంటుంది. ఇదంతా మాక్యులార్ డీజెనరేషన్తో ముడిపడి ఉంటుంది. ఈ రుగ్మతను తేనె సహాయంతో సులభంగా నివారించవచ్చు. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కంటి కండరాల్ని ఆరోగ్యంగా పటిష్టంగా ఉంచడానికి దోహదపడతాయి. క్రమం తప్పకుండా తేనె వాడటం వల్ల కంటిచూపు కచ్చితంగా మెరుగుపడుతుంది.
వయస్సు పెరిగే కొద్దీ కంటి కింద ముడతలు, గీతల్ని తగ్గించడంలో తేనె అద్భుతంగా పని చేస్తుంది. మూసిన కళ్లపై కాస్త తేనె వేసి...ఓ పదిహేను నిమిషాల సేపు విశ్రాంతి తీసుకోవాలి. అనంతరం గోరువెచ్చని నీటితో కడగాలి.
ప్రధానంగా కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్ ( Eye Infection ) కు తేనె చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్యాక్టీరియా, వైరస్ లేదా ఇతర సూక్ష్మజీవుల కారణంగా తలెత్తే కంటి ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి తేనె ఓ దివ్యౌషధమే. ఎందుకంటే తేనెలో యాంటీ బాక్టీరియల్ గుణాలున్నాయి. సమాన పరిమాణంలో తేనె, వేడినీటిని బాగా కలపాలి. కాటన్ బడ్స్ సహాయంతో ఈ మిశ్రమాన్ని కంటికి అప్లై చేయాలి. Also read: Morning Drink: టీ మాత్రమే కాదు.. ఉదయానే ఇవి కూడా ట్రే చేయండి