ఆర్మీ (Indian Army)లో చేరి సేవలు అందించడం అనేది ఓ ఆశయం, లక్ష్యంగా చేసుకుని ఎందరో త్యాగాలు చేస్తున్నారు. అయితే జవాన్లను గౌరవించుకోవడం మన అందరి బాధ్యత కానీ, తాజాగా జరిగిన ఓ ఘటన ఇండియన్ డిఫెన్స్ వారికి సైతం అవమానంగా అనిపించింది. ఇంటికి వెళ్తున్న ఓ జవానును అకారణంగా అరెస్ట్ చేసి రెండు రోజులు జైలులో గడిపేలా చేశారు. దీనిపై బిహార్ (Bihar) పోలీసుశాఖ, ఇండియన్ ఆర్మీ (Indian Army) మధ్య ప్రతికూల పరిస్థితుల వాతావరణం నెలకొంది. ఇంటికి వెళ్లాలనుకోవడమే జవాను చేసిన తప్పిదమా అని ఇండియన్ డిఫెన్స్ ఫ్యాన్ పేజీలో సోషల్ మీడియా పోస్టులో ప్రశ్నించారు. ఆ పేజీకి 28 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. Also Read : Binod Kumar: కరోనాతో పోరాడుతూ ఐజీ కన్నుమూత
ఇండియన్ డిఫెన్స్ ఫ్యాన్ పేజీ ఫేస్‌బుక్ పోస్ట్ ప్రకారం.. రైఫిల్ మ్యాన్‌గా రవీంద్ర ఆర్య (34) మణిపూర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఆయన దేవీ నవరాత్రులు (Navratri), దుర్గా పూజ నేపథ్యంలో సెలవులు తీసుకున్నారు. అవధ్ అస్సామ్ ఎక్స్‌ప్రెస్ రైలులో దిమపూర్ నుంచి బరేలీకి అక్టోబర్ 16న రవీంద్ర ఆర్య బయలుదేరారు. 5 మద్యం బాటిళ్లతో ప్రయాణిస్తున్నాడని ఛప్రా రైల్వే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆర్మీ జవాన్లకు ఇచ్చే కోటాలో తాను విక్రయించిన మద్యం బాటిల్స్ బిల్లులతో పాటు తన ఐడీ కార్డు సైతం చూపించారు.
Also Read : India Covid-19: మళ్లీ వేయి మార్క్ దాటిన కరోనా మరణాలు
Bringing this incident to the notice of authorities: This is Rifleman Ravindra Arya, of 34 Assam Rifles, Manipur, who...
Posted by Indian Defence on Saturday, October 17, 2020
కాగా, జవాను రవీంద్ర మాటలను బిహార్ రైల్వే పోలీసులు పట్టించుకోలేదు. ఆయన చేతికి బేడీలు వేసి గోపాల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పరిమితికి మించిన మద్యం బాటిళ్లతో ప్రయాణిస్తున్నారని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆర్మీ జవాన్లను పర్మిషన్ ఉన్న మేరకు రవీంద్ర మద్యం బాటిళ్లను తీసుకెళ్తుండగా అకారణంగా ఆయనను ఆరెస్ట్ చేశారని ఇండియన్ డిఫెన్స్ పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. Telangana Covid-19: తాజాగా 1,436 కరోనా కేసులు
అయితే అదే సమయంలో కోర్టులో మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టని కారణంగా చేయని తప్పిదానికి జవాను రెండు రోజులపాటు జైలులో గడపాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. పూజ సమయానికి ఇంటికి వెళ్లాలనుకోవడమే జవాను చేసిన తప్పిదమని, అందుకే ఆయన అరెస్ట్ అయ్యారని పోస్టులో పేర్కొన్నారు. బిహార్ రైల్వే పోలీసుల పనితీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆర్మీ జవాన్లను సైతం అకారణంగా అరెస్ట్ చేసి వేధిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe