భగవద్గీత పారాయణం చేయిస్తానని మహారాష్ట్రకు చెందిన ఇద్దరు అమ్మాయిలని ఇంటికి తీసుకొచ్చుకున్న ఓ పూజారి వారి జీవితాలతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఇద్దరు యువతులని శారీరకంగా వాడుకునే ప్రయత్నం చేశాడు. చెబితే విననందుకు వారిని చితకబాదాడు. అంతటితో ఆగకుండా వారి అశ్లీల చిత్రాలని బయటికీ లీక్ చేస్తానని బెదిరించాడు. దీంతో పూజారి తీరు చూసి విసిగిపోయిన బాధితురాళ్లు ఇద్దరూ అతడిని ఇంట్లోంచి బయటికి లాగి బడితే పూజ చేశారు.
ఉత్తర్ ప్రదేశ్లోని బృందావన్లో చోటుచేసుకున్న ఈ ఘటనలో బాధితురాళ్లకి స్థానికులు, గ్రామస్తుల నుంచి మద్దతు లభించడంతో నిందితుడు బాబా బసుదేవ్ శాస్త్రి బండారం బయటపడింది. బాబా బసుదేవ్ శాస్త్రిపై బాధితురాళ్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని బాధితురాళ్లని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
బాబాకి బడితే పూజ చేసిన బాధితురాళ్లు!!