Guinness world record: ఉంగరం ఒక్కటే..డైమండ్స్ మాత్రం 7 వేల 8 వందలు

ఉంగరం ఒక్కటే. డైమండ్స్ మాత్రం వేలల్లో. అత్యద్భుతంగా పొందుపరిచాడు హైదరాబాదీ నగల వ్యాపారి. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సృష్టించాడు. ది డివైన్ బ్రహ్మ వజ్ర కమలంగా పేరు పెట్టిన ఈ ఉంగరం గురించి తెలుసుకుందాం.

Last Updated : Oct 25, 2020, 04:13 PM IST
Guinness world record: ఉంగరం ఒక్కటే..డైమండ్స్ మాత్రం 7 వేల 8 వందలు

ఉంగరం ( Ring ) ఒక్కటే. డైమండ్స్ ( Diamonds ) మాత్రం వేలల్లో. అత్యద్భుతంగా పొందుపరిచాడు హైదరాబాదీ నగల వ్యాపారి. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ( Guinness book of records ) సృష్టించాడు. ది డివైన్ బ్రహ్మ వజ్ర కమలంగా పేరు పెట్టిన ఈ ఉంగరం గురించి తెలుసుకుందాం.

ఒకే ఉంగరంలో వేల సంఖ్యలో ఉంగరాలు పొందుపర్చి..అందంగా తీర్చిదిద్దడంలో భారతీయ నగల ( Indian Jewellers ) వ్యాపారులది అందెవేసిన చేయి. గతంలో 6 వేల 690 వజ్రాల్ని ఒకే ఉంగరంలో అమర్చి రికార్డు సృష్టించాడు ఓ నగల వ్యాపారి. అనంతరం మరో నగల వ్యాపారి 7 వేల 777 డైమండ్స్ తో మరో అద్భుతాన్ని సృష్టించాడు. ఇప్పుడు ఓ హైదరాబాదీ నగల వ్యాపారి సృష్టించిన ఘనత పాత రికార్డుల్ని చెరిపేసింది. 

ఏకంగా ఒకే ఉంగరంలో 7 వేల 801 డైమండ్స్ ( 7,800 Diamonds in a Single ring ) ను అమర్చి డివైన్ బ్రహ్మ వజ్ర కమలం ( The Divine Brahma vajra kamalam ) పేరుతో ఓ అద్భుతమైన ఉంగరాన్ని తయారు చేశారు హైదరాబాదీ నగల వ్యాపారి శ్రీకాంత్. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని ది డైమండ్ స్టోర్ బై చందూభాయి యజమాని శ్రీకాంత్...గత నెలలో ఈ  ఉంగరాన్ని తయారు చేసి..గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం సబ్మిట్ చేయగా..అనేక రౌండ్ల వెరిఫికేషన్ల అనంతరం రికార్డు దక్కింది. ఈ ఉంగరం తయారీకు  సంబంధించిన వీడియో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేజీలో పోస్ట్ అయింది. చేశారు. 

వాస్తవానికి ఈ కాన్సెప్ట్ ను 2018 సెప్టెంబర్ లోనే సిద్ధం చేసినా...ప్లానింగ్ కోసం 45 రోజుల సమయం పట్టిందని నగల వ్యాపారి శ్రీకాంత్ తెలిపారు. అనంతరం ఉంగరం తయారీ పని ప్రారంభించారు. 2019 మార్చి నాటికి రింగ్ బేస్ తయారైంది.  ఆగస్ట్ నాటికి రింగ్ తయారైంది. ఆ తర్వాత ఫినిషింగ్ టచ్ పని. ఇలా ఉంగరాన్ని తయారు చేసేందుకు మొత్తం 11 నెలల సమయం పట్టింది. ఆరు లేయర్స్ తో ఉన్న ఉంగరం ప్రతి లేయర్ లో 8 రేకులుంటాయి. Also read: Dussehra 2020: శమీ పూజ.. పాలపిట్ట దర్శనం ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా..?

Trending News