బీహార్ ఎన్నికల ( Bihar Elections ) అనంతరం రాజకీయ జీవితానికి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ( CM Nitish kumar ) చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఓటమి గ్రహించే ఈ వ్యాఖ్యలు చేశారంటూ..ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శలు ఎక్కుపెట్టారు.
బీహార్ ఎన్నికలకు మరో దశ మిగిలింది. ఈ నెల పదవ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపధ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఇవే తనకు చివరి ఎన్నికలని..అనంతరం రాజకీయ జీవితానికి రిటైర్మెంట్ ( Nitish kumar announced his retirement ) ఇస్తానని తేల్చిచెప్పారు. పూర్ణియాలో జరిగిన బహిరంగసభలో నితీష్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జీవితానికి వీడ్కోలు పలుకుతున్నా అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
ఇప్పుడీ వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ( RJD Leader Tejaswai yadav ) విమర్శలు ఎక్కుపెట్టారు. బీహార్ ను అభివృద్ధి పథంలో నడపలేరని ముందు నుంచే చెబుతున్నామన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నారంటూ ఎద్దేవా చేశారు. ఓటమి ముందే గ్రహించి..ఇలాంటి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.
ముూడుదశల బీహార్ ఎన్నికల్లో ఇప్పటికే అంటే అక్టోబర్ 28, నవంబర్ 3 తేదీల్లో రెండు దశల పోలింగ్ పూర్తయింది. మూడవదశ పోలింగ్ నవంబర్ 7వ తేదీన జరగనుండగా..ఫలితాలు 10వ తేదీన వెలువడనున్నాయి. Also read: Covaxin vaccine: 2021 ఫిబ్రవరికి అందుబాటులో వ్యాక్సిన్