2018.. తెలుగు భాషకు ఎందుకు ప్రత్యేకం..!

2018 సంవత్సరం తెలుగు భాషకు ప్రత్యేకమైందని.. ఈ సంవత్సరాన్ని భాషా పరిరక్షణ సంవత్సరంగా ప్రకటిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటనను జారీచేశారు.

Last Updated : Jan 1, 2018, 01:56 PM IST
2018.. తెలుగు భాషకు ఎందుకు ప్రత్యేకం..!

2018 సంవత్సరం తెలుగు భాషకు ప్రత్యేకమైందని.. ఈ సంవత్సరాన్ని భాషా పరిరక్షణ సంవత్సరంగా ప్రకటిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటనను జారీచేశారు. "ఈ రోజు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భాషను కాపాడుకోవడంలో పుస్తకాలు చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే నేడు ట్విటర్, ఫేస్బుక్ లాంటివి వచ్చాక చదివే పాఠకులు తగ్గిపోతున్నారు. ఈ క్రమంలో టెక్నాజీని ఉపయోగించి పుస్తకాలను ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం, సంస్థలకు చేతనైన సహాయం చేస్తుంది. ఉపాధి కోసం ఆంగ్లం నేర్చుకుంటున్నా, జాతి ఉనికిని చాటడానికి తెలుగు భాషను పరిరక్షించడానికి అందురూ పూనుకోవాలి" అని తెలిపారు.

సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన నవ్యాంధ్ర పుస్తక సంబరాల వేదికపై ఆయన ఈ ప్రకటన చేశారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు మాట్లాడుతూ.. తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం సాధ్యమైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. 

 

Trending News