భారత నావికాదళానికి చెందిన మిగ్ -29కే యుద్ధవిమానం గోవాలో కుప్పకూలింది. గోవా విమానాశ్రయం వద్ద రన్‌వేపై కుప్పకూలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో ట్రైనీ పైలెట్ ఉన్నాడు. అతను సురక్షితంగా బయటపడి సిబ్బందికి సమాచారం అందించారు. మంటలను ఆర్పేందుకు అత్యవసర బృందం రంగంలోకి దిగింది.
నావికా అధికార ప్రతినిధి మాట్లాడుతూ, "గోవా ఎయిర్పోర్ట్ నుండి టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటన మధ్యాహం 12 గంటల ప్రాంతంలో గోవాలోని డబోలిం విమానాశ్రయం వద్ద చోటుచేసుకుంది" అన్నారు.
Fire on MiG-29K aircraft being extinguished at Goa airport, after the aircraft went off runway while taking off & caught fire pic.twitter.com/woeBWmqgY1
— ANI (@ANI) January 3, 2018
A Mig29K aircraft with under-trainee pilot goes off runway while taking off at Goa airport. Pilot ejects to safety. Fire on aircraft being extinguished @DefenceMinIndia @SpokespersonMoD
— SpokespersonNavy (@indiannavy) January 3, 2018