హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు అంతకంటే ముందుగా కరోనా పరీక్షలు చేయించుకుని.. నెగటివ్ అని నిర్ధారణ చేసుకున్న తర్వాతే ప్రచారంలో పాల్గొనేలా చూడాలంటూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ప్రముఖ న్యాయవాది రాపోలు భాస్కర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రచారంలో పాల్గొనే ప్రతీ ఒక్కరికీ కరోనా పరీక్షలు తప్పనిసరి చేయాల్సిందిగా ఈ కోరుతూ ఆయన పిటిషన్ వేశారు.
కరోనావైరస్ ( Coronavirus ) మళ్లీ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పిటిషనర్ రాపోలు భాస్కర్ తన పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ కేసులు మరింత పెరగకుండా ఉండేందుకు ప్రతీ ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Also read : GHMC Elections: అందుకే వాళ్లు భాగ్యలక్ష్మి గుడికి వెళ్లారు: మంత్రి కేటీఆర్
Also read : Coronavirus second wave: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ వస్తుందా ? మంత్రి ఈటల మాటేంటి ?
Also read : Dharani portal updates: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ వాయిదా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి
GHMC Elections 2020: కరోనా పరీక్షల తర్వాతే ప్రచారం