హైదరాబాద్: మంత్రి కేటీఆర్ శనివారం జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బిజీబీజీగా గడిపారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలానగర్‌లో జరిగిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. నగరంలో ఆరేండ్ల కిందకు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి ఓటర్లకు వివరించి చెప్పే ప్రయత్నం చేశారు. ఆరు ఏండ్ల కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్టం ఏం అవుతుందో అని ఆందోళన ఉంటుండె. ఒక్కాయనేమో తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు అని అన్నాడు. ఇంకొకాయన ఇంకోలా అని అన్నీ నెగటివ్ కామెంట్స్ వినపడ్డాయి. కానీ వాళ్లందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ ఆరేండ్లలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందా లేదా అని ఓటర్లను ప్రశ్నించారు మంత్రి కేటీఆర్.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఫతే నగర్‌లో ఇరుకుగా ఉన్న బ్రిడ్జ్‌ను మరింత విస్తరించుకుంటున్నాం. ఇలా హైదరాబాద్‌లో కొత్త కొత్త బ్రిడ్జ్‌లు ఎన్నో కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరం వ్యాప్తంగా క్యాంటీన్స్ ఏర్పాటు చేసి 5 రూపాయలకే అన్నం పెడుతోంది. లక్ష డబల్ బెడ్ రూమ్‌లు పూర్తయ్యాయి. త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ( Double bed rooms houses ) ప్రారంబిస్తాం అని కేటీఆర్ స్పష్టంచేశారు.
Also read : GHMC Elections, Bandi Sanjay: దమ్ముంటే అరెస్ట్ చేయండి: బండి సంజయ్ సవాల్
హైదరాబాద్ నుండి ఒక కేంద్ర మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన హైదరాబాద్ కోసం ఏం చేసిర్రు.. ఏం లేదు... కరోనావైరస్ ( Coronavirus ) వ్యాపిస్తున్న కష్ట కాలంలోనూ మీకు మేము అండగా ఉండి పేదలను ఆదుకుంది టీఆర్ఎస్ ప్రభుత్వమే ( TRS govt ) కానీ కేంద్రం కాదు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గత ఆరేళ్లలో నగరంలో శాంతి భద్రతల ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధితో ముందుకు పోతోంది. ఒకవైపు ప్రపంచ దేశాలతో హైదరాబాద్ పోటీ పడుతోంటే.. మరోవైపు కులం, మతం పేరుతో వారు కుట్రలు చేస్తున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు.
Also read : Dharani portal updates: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ వాయిదా ?
భాగ్యలక్ష్మి గుడికి ఎందుకు వెళ్లారు?
వరద బాధితులకు వరద సాయం అందకుండా చేయడానికి తనకు ఏ సంబంధం లేదని నిరూపించుకుంటానికి శుక్రవారం తెలంగాణ బీజేపి చీఫ్ బండి సంజయ్ ( Bandi Sanjay ) భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇదే వివాదాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావిస్తూ.. ''నిన్న వాళ్లు భాగ్యలక్ష్మి గుడికి ఎందుకు వెళ్లారు ? ఎందుకు మీకు చిత్తారమ్మ తల్లి, బల్కం పేట ఎల్లమ్మ, తాడ్‌బండ్ హనుమాన్ గుడి పనికి రాదా... ఇక్కడికి రారు.. ఎందుకంటే వారికి ఇండియా పాకిస్థాన్ వివాదం కావాలి. అందుకే ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వాళ్లు భాగ్యలక్ష్మి ఆలయానికే వెళ్తారు'' అని మండిపడ్డారు.
Also read : GHMC elections 2020: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. టీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా ఇదే
వరద సాయం ఆగిపోయేలా చేశారు.. మరోసారి మంత్రి కేటీఆర్ ఆరోపణలు..
వరద బాధితులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ( GHMC Elections 2020 Results ) పూర్తయ్యాక వారికి తప్పకుండా వరద సాయం ఇస్తాం. హైదరాబాద్‌లో వరద సాయం ఇస్తుంటే కావాలని కొంత మంది ఇవ్వకుండా ఆగిపోయేలా చేశారు అని మరోసారి ఆరోపించారు. ఆరేళ్లలో ఎం చేశామో నేను చూపిస్తా.. మరి మీరు 60 ఏండ్లలో ఏం చేశారో చూపిస్తారా ? అని టీఆర్ఎస్ ప్రత్యర్థులకు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో ఆగం చేసే పార్టీ కావాలా లేక అభివృద్ధి చేస్తున్న పార్టీ కావాలా తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. డిసెంబర్ 1న కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించి గ్రేటర్‌లో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలి అని మంత్రి కేటీఆర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
Also read : GHMC Elections: కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ జాబితా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి
GHMC Elections: అందుకే వాళ్లు భాగ్యలక్ష్మి గుడికి వెళ్లారు: మంత్రి కేటీఆర్