తెలంగాణలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ పై విమర్శలు మొదలైయ్యాయి. దీనికి కోదండరాం శంఖారావం పూరించారు. కోదందరాం విమర్శలు ప్రధానంగా సీఎం కేసీఆర్ పై చేసినప్పటికీ..గురిమాత్రం పవన్ పై పెట్టి.. పరోక్ష విమర్శలు సంధించారు. హైదరాబాద్ లో ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ..టి సర్కార్ తెలంగాణ ద్రోహులను ఆదరిస్తోందని దయ్యబట్టారు. తెలంగాణ కోసం పోరాడిన వారిని పక్కన పెట్టి ద్రోహులను ఆదరించడం అన్యాయమన్నారు.
పవన్ పర్యటస్తున్న సమయంలో కోదండరాం ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం... వాస్తవానానికి కోదండరాం పర్యటనను అడ్డుకున్న టీఆర్ఎస్..పవన్ విషయంలో మాత్రం సైలెంట్ ఉంటోంది. ఈ నేపథ్యంలో కోదండరాం ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కాగా పవన్ గురించి ప్రత్యక్షంగా విమర్శలు చేసేందుకు కోదండారం నిరాకరించారు. పవన్ రాజకీయంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ పవన్ గురించి మాట్లాడి తన హుందాతనాన్ని దిగజార్చుకోలేని కోదండరాం ఆగ్రహం వెళ్లగక్కారు.