Google maps: ప్రాణం తీసిన గూగుల్ తల్లి..డ్యామ్‌లో పడిపోయి..

Google maps: ప్రతి చిన్నవిషయానికీ గూగుల్‌ని ఆశ్రయించడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా రూట్, అడ్రస్ విషయంలో. ఇప్పుడు అదే కొంపముంచింది. గూగుల్ తల్లి ప్రాణాలు తీసింది.

Last Updated : Jan 13, 2021, 12:38 PM IST
  • గూగుల్ తల్లిని ఆశ్రయించి ప్రాణాలు పోగొట్టుకున్న వైనం
  • మహారాష్ట్రంలో ట్రెక్కింగ్ కోసం బయలుదేరి గూగుల్ మ్యాప్స్ నమ్మకుని..డ్యామ్ లో వెళ్లిపోయిన కారు
  • ముగ్గురు ప్రాణాలు దక్కించుకోగా..ఓ వ్యక్తి మృతి
Google maps: ప్రాణం తీసిన గూగుల్ తల్లి..డ్యామ్‌లో పడిపోయి..

Google maps: ప్రతి చిన్నవిషయానికీ గూగుల్‌ని ఆశ్రయించడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా రూట్, అడ్రస్ విషయంలో. ఇప్పుడు అదే కొంపముంచింది. గూగుల్ తల్లి ప్రాణాలు తీసింది.

తెలియని సమాచారం కోసమైనా...సందేహాలొచ్చినా..మరీ ముఖ్యంగా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు రూట్స్ తెలియనప్పుడు..అడ్రస్ కోసం గూగుల్ తల్లి ( Google thalli ) ని అంటే గూగుల్ మ్యాప్స్‌ని ఆశ్రయించడం సర్వసాధారణంగా మారింది. షార్ట్‌కట్ రూట్స్ కోసం కూడా గూగుల్ ( Google ) తల్లినే అడుగుతుంటాం. చాలాసార్లు గూగుల్ మ్యాప్ నమ్మకుని భంగపాటుకు గురైన సందర్భాలున్నాయి. 

మహారాష్ట్ర ( Maharashtra ) లో ఏకంగా ఘోరం జరిగిపోయింది గూగుల్ తల్లిని నమ్ముకుని. గూగుల్ మ్యాప్ ( Google maps ) గుడ్డిగా ఫాలో అవుతూ వెళ్లిన ఓ కారు ఏకంగా డ్యామ్‌లో పడిపోయింది. ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు దక్కించుకోగా..మరో వ్యక్తి మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన కలకలం కల్గించింది. 

పూణే ( Pune ) కు చెందిన శేఖర్ మిత్రులతో కలిసి ఫార్చ్యూనర్ కారులో ట్రెక్కింగ్‌కు బయలుదేరారు. డ్రైవర్ సతీష్, మిత్రుడు సమీర్ మరో వ్యక్తి తోడుగా ఉన్నారు. మహారాష్ట్రంలో అత్యంత ఎత్తైన ప్రదేశం కల్సుబాయ్ మీద ట్రెక్కింగ్ ( Trekking ) చేయాలనుకున్నారు. మద్యలో దారి తప్పిపోవడంతో గూగుల్ మ్యాప్స్‌ని ఆశ్రయించారు.  దురదృష్టవశాత్తూ గూగుల్ తప్పు రూట్ చూపించింది. అది తెలియక గూగుల్ మ్యాప్ ఫాలో అయ్యారు. ఓ డ్యామ్ వద్దకు చేరుకున్నారు. చీకట్లో బ్రిడ్జి ఉందనుకుని ముందుకుపోనిచ్చారు.  అంతే క్షణాల్లో కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోసాగింది. ప్రమాదం గ్రహించిన శేఖర్ మరో ఇద్దరు మిత్రులు డోరు తెర్చుకుని..ఈదుకుంటూ బయటపడ్డారు. ఈత రాని  డ్రైవర్ సతీష్ కారులోనే ప్రాణాలొదిలాడు. 

వాస్తవానికి అక్కడ బ్రిడ్జ్ ఉండటం నిజమే. కానీ ఏడాదిలో 8 నెలలు మాత్రమే తెరిచుంటుంది. సమీపంలో ఉన్న పెద్ద డ్యామ్ ( Dam ) నుంచి నీరు విడుదల చేసినప్పుడు ఈ బ్రిడ్జిపైనుంచి ప్రవాహం వెళ్తుంటుంది. దాంతో నాలుగు నెలల పాటు బ్రిడ్జి మూసేస్తారు. స్థానికులకు ఈ విషయం తెలుసు కాట్టి జాగ్రత్త వహిస్తుంటారు. గూగుల్‌లో ఈ విషయాలు అప్‌డేట్ కావు కాబట్టి..ఈ ఘోరం జరిగింది. అందుకే గూగుల్ తల్లిని అన్నిసార్లు నమ్మడం ప్రాణాంతకం కావచ్చు మరి. 

Also read: Narendra Modi: భోగి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News