Red Pre Release Event: ఆ తప్పిదంపై స్పందించిన హీరో రామ్ పోతినేని

Ram Pothineni Responds On Mistake at Red Movie Pre Release Event: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ రెడ్. పలు భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జనవరి 12న రాత్రి నిర్వహించారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో జరిగిన తప్పిదంపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2021, 03:01 PM IST
  • టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ రెడ్
  • మంగళవారం రాత్రి రెడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు
  • ఓ చిన్న తప్పిదం జరిగిందని ట్రోల్ చేస్తున్న కొందరు నెటిజన్స్
Red Pre Release Event: ఆ తప్పిదంపై స్పందించిన హీరో రామ్ పోతినేని

Ram Pothineni On Mistake at Red Movie Pre Release Event: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ రెడ్. పలు భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జనవరి 12న రాత్రి నిర్వహించారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో జరిగిన తప్పిదంపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ఈ విషయంపై ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చాలా పాజిటివ్‌గా స్పందించారు. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలంటూ పిలుపునిచ్చారు. అసలేం జరిగిందంటే.. రామ్ పోతినేని(Ram Pothineni)  రెడ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విచ్చేశారు. ఆయనకు రెడ్ మూవీ టీమ్ తొలి టికెట్ అందించింది. ఆ టికెట్‌ను త్రివిక్రమ్ ఆవిష్కరించగా అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.

Also Read: Actress Aathmika Photos: అందాల నటి ఆత్మిక లేటెస్ట్ ఫొటోస్

 

 

రెడ్ సినిమా టికెట్‌కు బదులుగా అందులో టాలీవుడ్(Tollywood) హీరో రవితేజ నటించిన క్రాక్ సినిమా టికెట్ వచ్చింది. అయితే తప్పిదాన్ని గుర్తించిన ఈవెంట్ ఆర్గనైజర్ శ్రేయాష్ మీడియా అదే టికెట్‌పై క్రాక్ పేరు మీద ‘రెడ్’ మూవీ స్టిక్కర్ అతికించింది. దీనిపై కొందరు నెటిజన్లు అనవసరంగా ట్రోల్ చేశారు. రెడ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వెళ్తే.. వేరే సినిమా టికెట్ ఎలా ఇచ్చారెంటి... అంటూ కామెంట్లు వచ్చాయి. దీనిపై రామ్ పోతినేని చాలా పాజిటివ్‌గా స్పందిస్తూ ట్వీట్ చేశారు.

Also Read: Pongal 2021 Date, Time: మకర సంక్రాంతి తేదీలు, ముహూర్తం.. పండుగ ప్రాముఖ్యత

‘మా ఈవెంట్‌ను మరపురాని ఈవెంట్‌గా మార్చినందుకు త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు. అభిమానులను కలుసుకోవడం ఎప్పటికీ సంతోషదాయకమే. మా వార్తలు రాస్తూ సహకరిస్తూ మీడియాకు కృతజ్ఞతలు.  అప్పుడప్పుడు తప్పులు జరుగుతుంటాయి శ్రేయాస్ శ్రీనివాస్. అయినా ఏం పర్లేదు. ఎప్పటికీ మీరే బెస్ట్.. చీర్స్ అంటూ’ హీరో రామ్ పోస్ట్ చేశారు.

Also Read: LPG Tatkal Seva: బుకింగ్ చేసిన అరగంటకే ఎల్‌పీజీ సిలిండర్ డెలివరీ 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News