మలైకా అరోరా రెండో పెళ్లికి సిద్ధమైనట్టు బాలీవుడ్ మీడియా బాహటంగానే చెప్పుకుంటోంది. తాను ఇష్టపడుతున్న అర్జున్ కపూర్‌ని రెండో పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోందనేది ముంబై మీడియా కథనాల సారాంశం. గత కొంత కాలంగా బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, మలైకా అరోరా డేటింగ్‌లో ఉన్నారు. ఇప్పటికే కలిసి జీవిస్తున్న ఈ జంట.. త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట. బోనీ కపూర్ మొదటి భార్య కూతురు అయిన అర్జున్ కపూర్ వయస్సులో మలైకా అరోరా కంటే 15 సంవత్సరాలు చిన్నవాడు.
Also read : Vakeel Saab Teaser: వకీల్ సాబ్ టీజర్ అదుర్స్
వచ్చే సమ్మర్‌లో మలైకా అరోరా, అర్జున్ కపూర్ ( Arjun Kapoor ) పెళ్లి చేసుకోబోతున్నారని ఇంకొన్ని కథనాలు చెబుతున్నాయి. మలైకా అరోరా మూడేళ్ల ( Malaika Arora ) క్రితమే తన భర్త అర్బాజ్ ఖాన్ నుండి డైవర్స్ తీసుకుని వేరుగా ఉంటోంది. అర్బాజ్ ఖాన్‌తో 19 ఏళ్ల పాటు కాపురం చేసిన తర్వాత ఆమె అతడి నుంచి విడాకులు తీసుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook