Pfizer vaccine: ఫైజర్ వ్యాక్సిన్‌పై సందేహాలు, వ్యాక్సిన్ తీసుకున్న 12 వేలమందికి కరోనా పాజిటివ్

Pfizer vaccine: ప్రపంచమంతా ఇప్పుడు కరోనా వ్యాక్సినేషన్ నడుస్తోంది. ఫైజర్ వ్యాక్సిన్ సామర్ధ్యంపై సందేహాలు ఎక్కువవుతున్నాయి. కట్టడి కావల్సిన వైరస్..ఇంకా ఎక్కువవుతోంది. ఫైజర్ వ్యాక్సిన్ కారణంగా 12 వేలమందికి వైరస్ సోకడం సంచలనంగా మారింది.

Last Updated : Jan 21, 2021, 01:52 PM IST
Pfizer vaccine: ఫైజర్ వ్యాక్సిన్‌పై సందేహాలు, వ్యాక్సిన్ తీసుకున్న 12 వేలమందికి కరోనా పాజిటివ్

Pfizer vaccine: ప్రపంచమంతా ఇప్పుడు కరోనా వ్యాక్సినేషన్ నడుస్తోంది. ఫైజర్ వ్యాక్సిన్ సామర్ధ్యంపై సందేహాలు ఎక్కువవుతున్నాయి. కట్టడి కావల్సిన వైరస్..ఇంకా ఎక్కువవుతోంది. ఫైజర్ వ్యాక్సిన్ కారణంగా 12 వేలమందికి వైరస్ సోకడం సంచలనంగా మారింది.

కరోనా వ్యాక్సినేషన్‌ ( Corona vaccination ) పై ప్రజలకు నమ్మకం కుదరడం లేదు. వ్యాక్సిన్ సామర్ద్యంపై సందేహాలే దీనికి కారణం. ప్రజలకున్న సందేహాలకు తగ్గట్టుగానే సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 95 శాతం సామర్ధ్యముందని చెప్పుకుని అత్యవసర అనుమతి పొందిన వ్యాక్సిన్ ఇప్పుడు అదే వైరస్ వ్యాప్తికి కారణమవుతోందనే విమర్శలు ఎదుర్కొంటోంది. చాలా దేశాల్లో ఫైజర్ వ్యాక్సిన్ అందించే కార్యక్రమం ప్రారంభమైంది. 

ఇజ్రాయిల్‌ ( Izrael ) లో ఫైజర్ వ్యాక్సిన్ ( Pfizer vaccine )  కలకలం రేపుతోంది. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న దాదాపు 12 వేలమందికి కరోనా వైరస్ పాజిటివ్ ( Twelve thousand tested positive ) ‌గా తేలడం సంచలనంగా మారింది. డిసెంబర్ 19న దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తొలివిడతలో వృద్ధులకు, హెల్త్ రిస్క్ ఎక్కువున్నవారికి, అత్యవసర సిబ్బందికి అందించారు. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 1 లక్షా 89 వేల మందికి కోవిడ్ పరీక్షలు ( Covid 19 tests ) నిర్వహించగా..12 వేల 4 వందల మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. మరో ముఖ్యమైన విషయమేమంటే..పాజిటివ్ వచ్చినవారిలో 69 మందికి ఇప్పటికే వ్యాక్సిన్ సెకండ్ డోస్ కూడా అందింది. అందుకే ఇప్పుడు సందేహాలు ఎక్కువవుతున్నాయి. ఫైజర్ వ్యాక్సిన్ సామర్ధ్యం ఊహించినదానికంటే చాలా తక్కువుందని నేషనల్ కో ఆర్డినేటర్ ఆన్ పాండమిక్ తెలిపారు. 

Also read: Joe Biden first speech: ఆద్యంతం ఆలోచనాత్మకం..స్పూర్తిదాయకంగా బిడెన్ తొలి పలుకులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News