Joe Biden first speech: ఆద్యంతం ఆలోచనాత్మకం..స్పూర్తిదాయకంగా బిడెన్ తొలి పలుకులు

Joe Biden first speech: ఓ అభ్యర్ధిగా కాదు..ప్రజాస్వామ్యానికి లభించిన విజయంగా మనం వేడుక చేసుకుంటున్నాం. ప్రజల ఆకాంక్ష ప్రతిబింబించింది. ప్రజల శక్తి తెలిసింది. ప్రజాస్వామ్యమే అత్యంత బలమైనదని..విలువైనదని మరోసారి తెలిసింది. అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ తొలి పలుకులివి..

Last Updated : Jan 20, 2021, 11:59 PM IST
Joe Biden first speech: ఆద్యంతం ఆలోచనాత్మకం..స్పూర్తిదాయకంగా బిడెన్ తొలి పలుకులు

Joe Biden first speech: ఓ అభ్యర్ధిగా కాదు..ప్రజాస్వామ్యానికి లభించిన విజయంగా మనం వేడుక చేసుకుంటున్నాం. ప్రజల ఆకాంక్ష ప్రతిబింబించింది. ప్రజల శక్తి తెలిసింది. ప్రజాస్వామ్యమే అత్యంత బలమైనదని..విలువైనదని మరోసారి తెలిసింది. అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ తొలి పలుకులివి..

అమెరికా 46వ అధ్యక్షుడి ( America president ) గా ప్రమాణ స్వీకారం చేసిన జో బిడెన్ ( Joe Biden ) తొలి ప్రసంగం ఆద్యంతం ఆలోచనాత్మకంగా సాగింది. అద్బుతమైన ఆలోచన..జో బిడెన్ సొంతమని నిరూపితమైంది. ప్రజాస్వామ్యంపై ఆయనకున్న అవగాహన, నమ్మకాన్ని ఆయన ప్రసంగమే ప్రతిబింబించింది. ఆయన తొలి ప్రసంగం ( Joe Biden First speech ) ఆయన మాటల్లోనే…

ఇవాళ మనం విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ అభ్యర్ధికి లభించిన విజయం కోసం కాదు. ప్రజాస్వామ్యానికి విజయం లభించినందుకు. ప్రజల ఆకాంక్ష విన్పించింది. ప్రజల ఆకాంక్ష కన్పించింది. ప్రజాస్వామ్యమే అత్యంత విలువైనది మరోసారి తెలిసింది. ప్రజాస్వామ్యానిదే విజయమని...తెలిసిన సందర్భమిదే మిత్రులారా..

మనమంతా కలిసి భాగస్వామ్యాల్ని సరిదిద్దుదాం. శాంతికి భాగస్వామిగా నమ్మకాన్ని కల్గిద్దాం. నేను రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాను. మన ప్రజాస్వామ్యాన్ని ( Democracy ) రక్షిస్తాను. అమెరికాను నేను రక్షిస్తాను. మీ సేవలో మీకు కావల్సినదంతా మీకిస్తాను. అధికారం ఉన్నందుకు కాదు..సాధ్యాసాధ్యాలున్నందుకు. నా వ్యక్తిగతం కోసం కాదు..ప్రజా శ్రేయస్సు దృష్ట్యా. మనమంతా కలిసి అమెరికా చరిత్రను లిఖిద్దాం. భయంతో కాదు..విభజనతో కాదు..వెలుగుతో..ప్రకాశంతో..చీకటితో కాదు. డీసెన్సీ..డిగ్నిటీ కూడిన కధను రాద్దాం. ప్రేమ అభిమానంతో...గొప్పదనాన్ని సృష్టిద్దాం. ఆ కధ మనల్ని నడిపించవచ్చు. ఆ కధ మనల్ని స్పూర్తి కల్గించవచ్చు..రానున్న తరాలకు చరిత్రను చెప్పే విధంగా ఆ కధ విన్పించవచ్చు. అమెరికా  ( America ) స్వేచ్ఛకు ప్రతిబింబమని మరోసారి ప్రపంచానికి నిరూపిద్దాం. 

Also read: Joe Biden Oath Ceremony: అద్యక్షుడిగా జో బిడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News