Ram mandir donations: అయోధ్య రామాలయానికి 15 వందల కోట్లు దాటిన విరాళాలు

Ram mandir donations: అయోధ్య రామమందిర నిర్మాణానికి నిధుల పెద్దఎత్తున వచ్చి పడుతున్నాయి. ఊహించనివిధంగా వస్తున్న విరాళాలు భవ్య రామమందిర నిర్మాణాన్ని సాకారం చేయనున్నాయి. ఇప్పటివరకూ వచ్చిన విరాళాల మొత్తం  ఎంతో తెలుసా..  

Last Updated : Feb 13, 2021, 11:36 AM IST
  • అయోధ్య రామాలయం నిర్మాణం కోసం భారీగా వస్తున్న విరాళాలు
  • జనవరి 15 న ప్రారంభమైన విరాళాల సేకరణ కార్యక్రమం, ఫిబ్రవరి 27 వరకూ విరాళాల సేకరణ
  • ఇప్పటికే అంటే పిభ్రవరి 12 నాటికి 1511 కోట్ల విరాళాలు
Ram mandir donations: అయోధ్య రామాలయానికి 15 వందల కోట్లు దాటిన విరాళాలు

Ram mandir donations: అయోధ్య రామమందిర నిర్మాణానికి నిధుల పెద్దఎత్తున వచ్చి పడుతున్నాయి. ఊహించనివిధంగా వస్తున్న విరాళాలు భవ్య రామమందిర నిర్మాణాన్ని సాకారం చేయనున్నాయి. ఇప్పటివరకూ వచ్చిన విరాళాల మొత్తం  ఎంతో తెలుసా..

అయోధ్య రామ జన్మభూమి వివాదం ( Ayodhya ram janmabhoomi dispute )లో సుప్రీంకోర్టు ( Supreme court ) తీర్పు అనంతరం రామ మందిర ( Ram mandir )నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన అనంతరం పనులు ఊపందుకున్నాయి. హిందూవుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణం కోసం విరాళాలకు తీర్ధ క్షేత్ర ట్రస్ట్ పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా 4 లక్షల గ్రామాల్లో 11 కోట్ల కుటుంబాలను ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యుల్ని చేయాలని నిర్ణయించారు. అప్పట్నించి భారీగా విరాళాలు వచ్చి చేరుతున్నాయి. 5 వందల ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం మందిర నిర్మాణం జరుగుతుండటంతో భక్తులు భారీగా స్పందించి విరాళాలు సమర్పిస్తున్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా రామ మందిరం ( Ram temple )నిర్మించే విధంగా ప్రణాళిక సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా హిందూవులకు పవిత్ర పుణ్యక్షేత్రంగా తీర్దిదిద్దాలనేది ఆలోచనగా ఉంది. 

జనవరి 15న ప్రారంభమైన విరాళాల సేకరణ ( Ayodhya donations )..ఫిబ్రవరి 27 వరకూ కొనసాగనుంది. ఇప్పటికే అంటే ఫిబ్రవరి 12వ తేదీ వరకూ రామ మందిర నిర్మాణం కోసం 1511 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. ఫిబ్రవరి 27 వరకూ మరింతగా పెరగవచ్చు. భూకంపాలు, తుపాన్ బీభత్సాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల్ని తట్టుకునేలా ఆలయ నిర్మాణం కొనసాగుతోంది. అందుకే ఇనుము వాడకుండా నిర్మిస్తున్నారు. వేల ఏళ్లయినా సరే చెక్కు చెదరకుండా ఉండేవిధంగా రాతితో నిర్మిస్తున్నారు. ప్రతి రాయికి మధ్య రాగి పలకల్ని ఏర్పాటు చేస్తున్నారు. 18 అంగుళాల పొడవు, 30 మిల్లీమీటర్ల వెడల్పు, 3 మిల్లీమీటర్ల లోతున్న పది వేల రాగి పలకలు అవసరమవుతాయి. ఈ రాగిపలకల్ని విరాళంగా ఇవ్వాలని పిలుపునిచ్చింది ట్రస్ట్. ఈ రాగి పలకలపై తమ పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, వంశం పేర్లు రాసుకోవచ్చు.

Also read: Thames river: 60 ఏళ్లలో తొలిసారి గడ్డకట్టిన నది, చలికి వణికిపోతున్న ఇంగ్లండ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదంరాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News