Polavaram project: ఏపీ జీవనరేఖ ప్రతిష్ఠాత్మక పోలవరం పనులపై డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ సంతృప్తి వ్యక్తం చేసింది. అటు పోలవరం నమూనా ప్రాజెక్టులోనూ..ఇటు క్షేత్రస్థాయిలోనూ పరిశీలన చేసి నిర్ధారించుకున్నారు. ఫిబ్రవరి 21న మరోసారి పరిశీలించి డిజైన్లపై తుది నిర్ణయం తీసుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో నిర్మితమవుతున్న ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు( Polavaram project )పనుల్లో ఇప్పటికీ కొన్ని డిజైన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ఖరాలు చేసే క్రమంలో డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్( Dam design review panel )ప్రాజెక్టు పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించింది. పూణేలోని సీడబ్ల్యూపీఆర్‌ఎస్ ( Central water and power research station) ఆవరణలో 3–డీ పద్ధతిలో నిర్మించిన పోలవరం నమూనా ప్రాజెక్టులో రకరకాల ఒత్తిడులతో నీటిని పంపించి చేసిన ప్రయోగాల ఫలితాలను క్షేత్రస్థాయిలో నిర్ధారించుకునేందుకు ప్రయత్నించారు. డిజైన్లపై నెలకొన్న సందేహాల్ని నివృత్తి చేసుకున్నారు. మరోవైపు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు.. Polavaram project authority (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో ఇవాళ అంటే ఫిబ్రవరి 20న రాజమండ్రిలో సమీక్షించనున్నారు.
రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సి నారాయణరెడ్డి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ లతో కలిసి కమిటీ పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించింది. స్పిల్ వే ( Spillway ), స్పిల్ ఛానెల్, స్పిల్ వే గ్యాలరీ, స్పిల్ వేకు అమర్చిన గేట్లు, ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్‌లతో పాటు రెండు కాపర్ డ్యామ్‌ల మధ్య చేపట్టిన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనుల్ని కమిటీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. గోదావరి నది వరద ( Godavari river flood ) ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించేందుకు తవ్వాల్సిన అప్రోచ్ ఛానల్ ప్రదేశాల్ని సైతం కమిటీ పరిశీలించింది. పూణేలోని సీడబ్ల్యూపీఆర్ఎస్‌లో చేసిన ప్రయోగాల్లో తేలిన విషయాల్ని పరిశీలిస్తూ డిజైన్లలో చేయాల్సిన మార్పులు చేర్పులపై చర్చ జరిగింది. ఫిబ్రవరి 21న మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Also read: Visakhapatnam steel plant issue: స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి అవసరమైతే రాజీనామాలకు సిద్ధం: విశాఖ ఎంపీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Polavaram project: పోలవరం పనులపై డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ సంతృప్తి
పోలవరం పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ సభ్యులు
పోలవరం 3డీ నమూనాలో చేసిన ప్రయోగాల్ని క్షేత్రస్థాయిలో నిర్ధారించుకుని సంతృప్తి వ్యక్తం చేసిన కమిటీ
ఫిబ్రవరి 21న మరోసారి క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం పెండింగ్ డిజైన్లపై నిర్ణయం