Today Horoscope: నేటి రాశి ఫలాలు మార్చి 1, 2021 Rasi Phalalu, వారికి వాహనయోగం

 పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 1న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2021, 07:53 AM IST
Today Horoscope: నేటి రాశి ఫలాలు మార్చి 1, 2021 Rasi Phalalu, వారికి వాహనయోగం

Horoscope Today 1 March 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 1న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
మీ వ్యక్తిగత జీవితంలో మీరు నిలిపివేసినవి ఈరోజు పరిష్కారం అవుతాయి. మీకు కొత్త నెలలో అన్ని వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి ఫలితాలు రానున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు కావడంతో వాహనాలు కొనుగోలు చేసే సూచనలు గోచరిస్తున్నాయి.

Also Read: Maha Shivaratri 2021: మహా శివరాత్రి రోజున ఇలాచేస్తే పరమశివుడ్ని ప్రసన్నం చేసుకోవచ్చు

వృషభ రాశి
ఈరోజు వృషభ రాశి వారు ఒంటరిగా పనులు చేయగలిగితే చాలా పూర్తి చేసుకోవచ్చు. ఇతరులు మీకు సాయం చేసేందుకు అంతగా ముందుకురారు. కనుక ఈ రోజు ఇతరులకు దూరంగా ఉండటంతో పాటు మీరు  ఏం చేస్తున్నారనే దానిపై దృష్టి పెట్టడం మంచిది. సాయంత్రం నాటికి పని పూర్తి చేసి స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది.

మిథున రాశి
సమాజం కోసం ఏదైనా చేయాలని తాపత్రయపడతారు. కానీ మీ వ్యక్తిగత జీవితానికి సైతం తగిన సమయం కేటాయించాలని గుర్తుంచుకోండి. మీ మనస్సును శాంతపరచడానికి ధ్యానం చేయండి. అవసరమైతే శారీరక శ్రమ ద్వారా ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు కలిసిరాదు. ఖర్చులు పెరగడంతో రుణాల కోసం చేయి చాపుతారు. ఆలయాలు సందర్శించాలని నిర్ణయించుకుంటారు.

కర్కాటక రాశి
మీ కెరీర్‌లో ఒక అడుగు ముందుకు వేయడానికి ఇది మంచి రోజు. చాలా కాలం నుంచి మిమ్మల్ని వెనక్కి నెడుతున్న అవాంతరం తొలగిపోతుంది. కొత్త లక్ష్యాలు నిర్దేశించుకని ముందుకు సాగుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. అయితే ఉద్యోగమా? లేక కుటుంబమా? అనే పరిస్థితి తలెత్తుతుంది. కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.

Also Read: Astrology: కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశం, 12 రాశుల వారిపై దీని ప్రభావం ఇలా ఉండనుంది

సింహ రాశి
ప్రజలు మీ పట్ల ఆకర్షితులు కావడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. మీ ఆటలు, ఆలోచన అలా ఉంటుంది. మీ కెరీర్ లక్ష్యాలపై దృష్టి పెట్టండి, రోజు చివరిలో మీ వైపు పెద్ద విషయం కదిలించనుంది. బంధువుల నుంచి ఒత్తిడి అధికం అవుతుంది. అధికంగా శ్రమించినా కొన్ని పనులు వాయిదా వేయాల్సి వస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులకు అంతగా కలిసిరాదు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. 

కన్య రాశి
ఈరోజు కన్యారాశి తమ భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవాలి. మీ మనసులో ఉన్న బాధను బయటపెడితే కాస్త ప్రశాంతత దొరుకుతుంది. ఈ రోజు మీ వ్యక్తిగత జీవితాన్ని మీ పనికి దూరంగా ఉంచాలని మీరు భావిస్తారు. దైవదర్శనాలు చేసేందుకు సిద్ధమవుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్త పనులకు శ్రీకారం చుట్టేందుకు ఇది తగిన సమయం.

తులా రాశి
ఈరోజు మీరు చాలా సందేహాలతో ఆందోళనగా ఉన్నారు. దీనివల్ల మీ పనులలో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. మీరు నిర్ణయాలు మీరే తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకోకుండా కొన్ని వివాదాలలో చిక్కుకుంటారు. పనులలో అధికంగా శ్రమించాల్సి వస్తుంది.

Also Read: Srisailam Brahmotsavalu: మహా శివరాత్రికి ముస్తాబవుతున్న శ్రీశైలం క్షేత్రం 

వృశ్చిక రాశి
నేడు మీరు మీ పనులను విస్మరించరు. కొంత బద్ధకంగా ఉన్నా, పనులు చేయాలని నిర్ణయించుకుంటారు. ఎందుకంటే కొన్ని పనులు ఒక నిర్దిష్ట సమయ వ్యవధిలో చేయాలి. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీరు నేడు తగినంత విశ్రాంతి తీసుకుంటారు. 

ధనుస్సు రాశి
ఈ రోజు చాలా విజయవంతంగా ప్రారంభం కానుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని గమనిస్తున్నారని మరిచిపోవద్దు. మీరు ఇంట్లో మరియు ఆఫీసులో చాలా విషయాలకు నాయకత్వం వహించబోతున్నారు. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. కొన్ని పనుల కోసం ప్రయాణాలు తప్పనిసరి. వ్యాపారులకు అంతగా కలిసిరాదు. చాలాకాలం తరువాత కొందరు స్నేహితులను కలుసుకోనున్నారు.

మకర రాశి
సాధారణంగా మీ వ్యక్తిగత జీవితంలో మీ పనికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఈరోజు కాస్త మీ కుటుంబం, సన్నిహితుల కోసం సమయాన్ని కేటాయిస్తారు. నేడు పని నుంచి కొంత విశ్రాంతి తీసుకుని సరదాగా గడుపుతారు. కొన్ని విషయాలలో సన్నిహితులతో విభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగులకు అనుకున్న ఫలితాలు రావు. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి.

కుంభ రాశి
ఈ రోజు చంద్రుడు మీకు అనుకూలంగా పనిచేస్తున్నాడు. మీరు కోరుకున్నవి సులువుగా దక్కించుకుంటారు. తొందరపాటు తగదని గుర్తుంచుకోండి. కొన్ని విషయాలలో మీరు సాధారణం కన్నా అధికంగా కష్టపడాల్సి ఉంటుంది. భూమి, ఆస్తులకు సంబంధించిన విషయాలలో గొడవలు. నేడు ఆచితూచి మాట్లాడుతూ అడుగు వేయాలని మరువొద్దు.

మీన రాశి
సృజనాత్మకతను కోరుకుంటారు. ఆ పని చేసేటప్పుడు ప్రపంచానికి దూరంగా ఉంటారు. ఈరోజు దాని ఫలితాలు పొందనున్నారు. ఇల్లు లేదా ఆఫీసులో మార్పులు చేయాలనుకుంటే ఇది తగిన సమయం. మీరు పనిలో ఇతరుల సాయం తీసుకుంటారు. ప్రేరణ పొందడానికి బయట నడవడానికి ప్రయత్నిస్తారు. శుభవార్తలు అందుకుంటారు. వాహనయోగం, వస్తులాభాలు గోచరిస్తున్నాయి. శ్రమించి పనిచేసే ఉద్యోగులు, వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News