IND vs ENG 2nd ODI Highlights: తొలి వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియాకు రెండో వన్డేలో భారీ షాక్ తగిలింది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో మరో 6.3 ఓవర్లు మిగిలుండగానే ఇంగ్లాండ్ జట్టు విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ భారీ తప్పిదమే విరాట్ కోహ్లీ సేన ఓటమికి కారణమని భారత క్రికెట్ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 336 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ ఓపెనర్లు అద్బుత ఆరంభాన్నిచ్చారు. జానీ బెయిర్‌స్టో శతకాన్ని సాధించారు. మరో కీలక ఆటగాడు ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ 31 పరుగుల వద్ద రనౌట్ కాగా, అంపైర్ తప్పిదంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఇక అది మొదలుకుని ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడి భారత(Team India) ఓటమని ఖాయం చేశాడు. చివరికి 99 పరుగుల స్కోరు వద్ద ఔటై శతకాన్ని చేజార్చుకున్నాడు.
Also Read: CSK New Jersey: కొత్త జెర్సీ ఆవిష్కరించిన సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ఈ జెర్సీ చాలా ప్రత్యేకం
What was the soft signal by the field-umpire? #BenStokes @ICC #EngVsInd #INDvENG #ICC #BCCI pic.twitter.com/ww81yH9oHL
— Prashant (@vprashant4) March 26, 2021
ముఖ్యంగా హాఫ్ సెంచరీ తరువాత స్టోక్స్ వీర విహారం చేశాడు. కేవలం 11 బంతుల్లో 6 సిక్సర్లు, 2 ఫోర్లతో ఏకంగా 49 పరుగులు సాధించి మ్యాచ్‌ను టీమిండియా నుంచి దూరం చేశాడు. అయితే 31 పరుగుల వద్ద బెన్ స్టోక్స్(Ben Stokes) బ్యాట్ క్రీజులోకి రాకున్నా థర్డ్ అంపైర్ నౌటౌట్‌గా ఎలా ప్రకటించాడని క్రికెట్ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. ఒక్క తప్పుడు నిర్ణయం భారత విజయాన్ని దూరం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కావాలంటే మీరు వీడియో చూస్తే బెన్ స్టోక్స్ రన్ చేసిన విధానం, నౌటౌట్ ఎలా అవుతుందని వీక్షించి చెప్పాలంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ సైతం ఈ బెన్ స్టోక్స్ ఔట్ అని, బంతి వికెట్లను తాకి బెయిల్స్ లేస్తున్న సమయంలో బ్యాట్ క్రీజులోకి రాలేదంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కానీ ఈ ఒక్క తప్పిదం భారత ఓటమికి కారణమైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook