Sachin Tests Positive For COVID-19: సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్, ట్వీట్ ద్వారా స్పష్టం చేసిన క్రికెట్ దిగ్గజం

Sachin Tendulkar Tests Positive For CoronaVirus: మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయన కుటుంబసభ్యులకు సైతం కరోనా పరీక్షలు చేయించామని ట్వీట్ చేశారు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 27, 2021, 10:46 AM IST
Sachin Tests Positive For COVID-19: సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్, ట్వీట్ ద్వారా స్పష్టం చేసిన క్రికెట్ దిగ్గజం

Sachin Tendulkar Tests Positive For COVID-19: దేశంలో కరోనా వైరస్ రెండో దశ కొనసాగుతోంది. డబుల్ మ్యుటెంట్ కరోనా వైరస్ భారత్‌లో తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకూ భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు మంత్రులు, అధికారులు, నటుడు, క్రికెటర్లు, వ్యాపారులు ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు.

తాజాగా క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండూల్కర్ కరోనా బారిన పడ్డారు. స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోగా, సచిన్‌కు కోవిడ్-19 పాజిటివ్‌గా వైద్యులు నిర్దారించారు. ఈ విషయాన్ని తెలుపుతూ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) ట్వీట్ చేశారు. చాలా జాగ్రత్తలు తీసుకున్నా తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని చెప్పారు.

Also Read: Ben Stokes Run Out: టీమిండియా కొంప ముంచిన అంపైర్ నిర్ణయం, బెన్ స్టోక్స్ రనౌట్: యువీ

కుటుంబసభ్యులకు సైతం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించగా, వారికి మాత్రం కోవిడ్-19(COVID-19) నెగటివ్ అని తేలినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం డాక్టర్ల సలహా మేరకు తాను హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలకు, తనకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని మొత్తం కేసులలో దాదాపు 60 శాతం కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయని తెలిసిందే. ఈ క్రమంలో సచిన్ సైతం కరోనా బారిన పడి ఉంటారని సమాచారం.

Also Read: Shreyas Iyer Injury: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ, ఐపీఎల్ 2021కు శ్రేయస్ అయ్యర్ దూరం అయ్యే ఛాన్స్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News