/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Facebook CEO Mark Zuckerberg | ఈ ఏడాది ఆరంభం నుంచి భారత నెటిజన్లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారులు ఫేస్‌బుక్ సంస్థపై గుర్రుగా ఉన్నారు. వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీతో వినియోగదారుల డేటాకు భద్రత ఉండదని, వారి వ్యక్తిగత సమాచారం హ్యాకర్లు, సైబర్ నేరగాళ్ల చేతికి సైతం వెళ్లనుందని ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ డేటా లీక్ అయింది. సిగ్నల్ యాప్ సైతం ఆయన వాడుతున్నాడని లీకైన డేటా చెబుతోంది.

ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఫోన్ నెంబర్ ఆ లీకైన డేటా ఉండటం గమనార్హం. ఆయన నివాసం ఉండే ప్రదేశం, వివాహం వివరాలు, పుట్టినతేదీ, ఫేస్‌బుక్ యూజర్ ఐడీ లాంటి పలు విషయాలు లీక్ అయ్యాయి. జుకర్‌బర్గ్ సిగ్నల్ యాప్ సైతం వినియోగిస్తున్నారని సెక్యూరిటీ రీసెర్చర్ స్పష్టం చేశాడు. తన వ్యక్తిగత సమాచారం భద్రత కోసం తన ఫేస్‌బుక్ కంపెనీ(Facebook Data Leak)ది కాకుండా వేరే కంపెనీ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ చాటింగ్ యాప్ వినియోగించడం మరో ముఖ్యమైన అంశం. భద్రతా విభాగం నిపుణుడు డేవ్ వాకర్ ట్విట్టర్‌లో పలు విషయాలు ప్రస్తావించాడు.

Also Read: Gold Price Today 06 April 2021: బులియన్ మార్కెట్‌లో స్థిరంగా బంగారం, వెండి ధరలు, లేటెస్ట్ రేట్లు ఇవే

మార్క్ జుకర్‌బర్గ్(Facebook CEO Mark Zuckerberg) సిగ్నల్ యాప్ వినియోగిస్తున్నారని తెలపడంతో పాటు ఆయన లీకైన ఫోన్ నెంబర్, తదితర సమాచారం వెల్లడించాడు. వ్యక్తిగత సమాచారం భద్రతపై వాట్సాప్‌పై విమర్శలు, ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత్‌లో భారీగా వాట్సాప్ అన్‌ఇన్‌స్టాల్ చేసుకున్నారు. సిగ్నల్, టెలీగ్రామ్, కూ తదితర యాప్‌లకు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు మారుతున్నారు.

ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకులు క్రిస్ హ్యూజ్, డస్టిన్ మోస్కోవిట్జ్ లాంటి ప్రముఖుల వివరాలు సైతం లీక్ అయ్యాయి. 533 మిలియన్ల మంది ఖాతాదారుల డేటా లీక్, ఆన్‌లైన్‌లో వివరాలు అమ్మకం లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న జుకర్‌బర్గ్ సైతం డేటా లీక్ సమస్యలో చిక్కుకోవాల్సి వచ్చిందని సెక్యూరిటీ రీసెర్చర్ పేర్కొన్నాడు.

Also Read: Shreyas Iyer: ఐపీఎల్ 2021కు దూరమైనా పూర్తి వేతనం అందుకోనున్న శ్రేయస్ అయ్యర్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Facebook CEO Mark Zuckerbergs Phone Number And Personal Details Leaks online, he uses Signal
News Source: 
Home Title: 

Mark Zuckerberg: ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఫోన్ నెంబర్ లీక్, ఏ యాప్ వాడుతున్నాడంటే

Mark Zuckerberg Phone Number: ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఫోన్ నెంబర్ లీక్, ఏ యాప్ వాడుతున్నాడంటే
Caption: 
Facebook CEO Mark Zuckerbergs Phone Number Leaks Online
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారులు ఫేస్‌బుక్ సంస్థపై గుర్రు

ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ డేటా ఆన్‌లైన్‌లో లీక్ అయింది

ఫోన్ నెంబర్, ఆయన లొకేషన్, వాడుతున్న యాప్ వివరాలు లీక్

Mobile Title: 
Mark Zuckerberg: ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఫోన్ నెంబర్, లొకేషన్ లీక్
Shankar Dukanam
Publish Later: 
No
Publish At: 
Tuesday, April 6, 2021 - 12:11
Request Count: 
73
Is Breaking News: 
No