Shreyas Iyer: ఐపీఎల్ 2021కు దూరమైనా పూర్తి వేతనం అందుకోనున్న శ్రేయస్ అయ్యర్

Shreyas Iyer IPL 2021 Salary: ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యూలర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరం కానున్నాడు. అయితే అతడికి ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంఛైజీ శుభవార్త అందించింది. 

Written by - Shankar Dukanam | Last Updated : Apr 6, 2021, 12:05 PM IST
Shreyas Iyer: ఐపీఎల్ 2021కు దూరమైనా పూర్తి వేతనం అందుకోనున్న శ్రేయస్ అయ్యర్

టీమిండియా యువ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యూలర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరం కానున్నాడు. అయితే అతడికి ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంఛైజీ శుభవార్త అందించింది. సీజన్ మొత్తం అతడు అందుబాటులో లేకున్నా అతడికి అందివ్వాల్సిన కాంట్రాక్ట్ నగదును ఎలాంటి కోత విధించకుండా మొత్తం చెల్లించనున్నారు. 

ఇటీవల స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఫీల్డింగ్ చేస్తూ టీమిండియా బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. అతడి కుడి భుజానికి గాయం కావడంతో వన్డే సిరీస్, టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే అతడికి సర్జరీ చేయాల్సి వస్తుందని బీసీసీఐ తెలిపింది. దీంతో అతడు ఐపీఎల్ 2021(IPL 2021)కు దూరం కానున్నాడు. వీలైతే ప్లే ఆఫ్స్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశాలు సైతం లేకపోలేదు. ఏప్రిల్ 8న అయ్యర్‌కు శస్త్రచికిత్స చేయనున్నారు. ఐపీఎల్‌కు దూరమైనప్పటికీ అతడికి ఫీజు నగదు మొత్తం చేతికి రానుంది శుభవార్త బయటకు వచ్చింది.

Also Read: Gold Price Today 06 April 2021: బులియన్ మార్కెట్‌లో స్థిరంగా బంగారం, వెండి ధరలు, లేటెస్ట్ రేట్లు ఇవే

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు శ్రేయస్ అయ్యర్‌కు వార్షికంగా రూ.7 కోట్ల మేర చెల్లించనుంది. ప్రస్తుతం గాయం కారణంగా ఐపీఎల్‌కు ఈ ఆటగాడు దూరమైనా అతడికి బీసీసీఐ ఆటగాళ్ల ఇన్సూరెన్స్ స్కీమ్ కింద మొత్తం నగదు చేతికి వస్తుంది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగి ఉన్న టీమిండియా ఆటగాళ్లు గాయపడినా, ఐపీఎల్‌కు దూరమైతే పాక్షికంగా లేదా పూర్తి స్థాయిలో వారి కాంట్రాక్ట్ నగదును ఆటగాళ్లకు చెల్లించాలని ఇన్సూరెన్స్ స్కీమ్‌లో ఉంది. దాంతో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సందర్భంగా గాయపడ్డ శ్రేయస్ అయ్యర్‌కు (Delhi Capitals) పూర్తి స్థాయిలో రూ.7 కోట్ల వేతనాన్ని అందుకోనున్నాడు.

Also Read: IPL 2021: ఐపీఎల్ 2021 నిర్వహణపై BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్లారిటీ

కాగా, శ్రేయస్ అయ్యర్ గాయంతో ఐపీఎల్ 2021కు దూరం కావడంతో మరో యంగ్ టాలెంటెడ్ క్రికెటర్ రిషబ్ పంత్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ అప్పగించారు. ఐపీఎల్ 14లో సీనియర్ క్రికెటర్లకు అతడు మార్గనిర్దేశం చేయనున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్ 10న ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News