Karnataka: విజయం సాధించినందుకు ఆనందించాలో..ఆ మనిషే లేనందుకు బాధపడాలో తెలియని సందిగ్ద పరిస్థితి. స్థానిక ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఆమె..కోవిడ్ కారణంగా మరణించారు. వివరాలేంటంటే..
కర్నాటక (Karnataka)రాష్ట్రంలో విచిత్రమైన, సందిగ్దమైన పరిస్థితి ఎదురైంది.ఇటీవల జరిగిన స్థానిక సంస్థల (Local Body Elections)ఎన్నికల్లో ఓ అభ్యర్ధి భారీ విజయం సాధించారు. అయితే ఫలితాలకు ముందే కోవిడ్ సోకి ప్రాణాలు కోల్పోయారు ఆ అభ్యర్ధి. విజయం సాధించినందుకు సంతోషించాలో..మనిషే లేనప్పుడు విజయం ఎందుకని బాధపడాలో తెలియని పరిస్థితి. మనిషి లేకపోయినా...ప్రజల గుండెల్లో మాత్రం ఉన్నానని నిరూపించుకున్నారు ( Covid Deceased wins the election) ఆ అభ్యర్ధి.
రామనగర (Ramnagara)నగరసభ ఎన్నికల్లో 4వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన లీల భారీ మెజార్టీతో విజయం సాధించారు. దురదృష్టం ఏంటంటే ఫలితాలు వెలువెడక ముందే కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మనిషిని కోల్పోయి విషాదంలో ఉన్న ఆ కుటుంబానికి ఆమె విజయం సాధించిన విషయం ఏమాత్రం ఆనందం కల్గించలేకపోయింది. అయితే ప్రజల్లో తనకున్న స్థానమేంటనేది అందరికీ తెలిసింది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress), జేడీఎస్ ( JDS) పార్టీలు చాలా ప్రాంతాల్లో విజయం సాధించాయి. చెన్నపట్టణ నగర సభ ఎన్నికల్లో జేడీఎస్ పరువు దక్కించుకుంది. 31 వ వార్డుల్లో 16 కైవసం చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ( Bjp) లు ఏడేసి స్థానాలు గెల్చుకున్నాయి.
Also read: India Corona Outbreak: దేశంలో కరోనా విలయతాండవం, 24 గంటల్లో 4 లక్షలకు పైగా కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook