India Corona Crisis: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఓ వైపు భారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరోవైపు పెరుగుతున్న మరణాల సంఖ్య ఆందోళన కల్గిస్తోంది. గత 24 గంటల్లో 3 వేలకు పైగా మరణాలు నమోదవడం కలకలం రేపుతోంది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ఉధృతికి జనం బెంబేలెత్తిపోతున్నారు. నిన్నటి వరకూ మనచుట్టూ ఉన్నవాళ్లు..ఇప్పుడు ప్రాణాలతో ఉండటం లేదు. ఎక్కడ విన్నా కరోనా కేసులు, కోవిడ్ మరణాలే విన్పిస్తున్నాయి. వరుసగా ఆరవ రోజు కూడా దేశంలో 3 వేలకు పైగా కోవిడ్ మరణాలు ( Covid Deaths) సంభవించాయి. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా 3 లక్షల 68 వేల కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ దేశంలో కరోనా సోకినవారి సంఖ్య 1.99 కోట్లు కాగా, మరణాల సంఖ్య 2.18 లక్షలకు చేరుకుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15 లక్షల 4 వేల కోవిడ్ నిర్ధారణ పరీక్ష (Covid Tests) లు చేశారు. అంతకుముందు రోజు 18 లక్షల పరీక్షలు నిర్వహించారు.
గత 10 రోజుల్నించి దేశంలో ప్రతి రోజూ 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వరుసగా రెండ్రోజులైతే కేసుల సంఖ్య 4 లక్షలకు చేరుకుంది. ఆరు రోజులుగా కోవిడ్ కారణంగా మరణించేవారి సంఖ్య కూడా 3 వేలు దాటుతోంది. అంటే కేవలం పదిరోజుల్లోనే సరాసరిన 35 లక్షల కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. దేశంలో కరోనా మహమ్మారి నియంత్రణకు ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా, గోవా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ( Lockdown) అమలవుతుంటే..మిగిలిన ప్రాంతాల్లో వీకెండ్ లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ ( Night Curfew) అమలవుతున్నాయి. ఇక ఏపీలో గత 24 గంటల్లో అత్యధికంగా 1 లక్ష 4 వేల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా..23 వేల కేసులు బయటపడ్డాయి. తెలంగాణలో గత 24 గంటల్లో 58 వేల పరీక్షలు చేయగా..5 వేల 6 వందల మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.
Also read: India Lockdown: భారత్‌లో మరోసారి లాక్‌డౌన్ విధించాలంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుV
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook