Miss Universe 2020: మెక్సికో బ్యూటీ ఆండ్రియా మెజా మిస్ యూనివర్స్(Miss Universe 2020)గా ఎంపికయ్యారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఆదివారం రాత్రి జరిగిన ప్రపంచంలోని అత్యుత్తమ అందాల పోటీల ఫైనల్లో గెలుపొందిన ఆండ్రి మెజా విశ్వ సుందరిగా నిలిచారు. మిస్ యూనివర్స్ 2020గా మెక్సికో భామ నిలిచి అందాల కిరీటం సొంతం చేసుకున్నారు. భారత్‌కు చెందిన అడెలిన్ కాస్టెలినో మూడో రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు.
సిమ్మినోల్ హార్డ్ రాక్ హోటల్ అండ్ కాసినోలో మే 16న అందాల పోటీలలో జరిగిన మిస్ యూనివర్స్‌గా 26 ఏళ్ల మెక్సికో భామ ఆండ్రియా మెజా(Miss Universe Andrea Meza) నిలిచారు. తొలి రన్నరప్‌గా బ్రెజిల్ సుందరి జులియా గామా, మిస్ పెరూ జానిక్ మెసెటా రెండో రన్నరప్‌గా నిలిచారు. దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ విశ్వసుందరి(2019) జొజిబినీ తుంజీ మిస్ యూనివర్స్‌గా నిలిచిన ఆండ్రియా మెజాకు కిరీటాన్ని అలంకరించారు.
Also Read: EPFO Alert: కరోనాతో EPF ఖాతాదారులు మరణిస్తే, నామినీకి రూ.7 లక్షల పరిహారం
The new Miss Universe is Mexico!!!! #MISSUNIVERSE pic.twitter.com/Mmb6l7tK8I
— Miss Universe (@MissUniverse) May 17, 2021
74 దేశాల నుంచి సుందరీమణులు పోటీపడ్డ ఈ ప్రపంచ అత్యుత్తమ అందాల పోటీలలో మెక్సిన్ బ్యూటీ విజేతగా నిలవడం ఇది మూడోసారి. విజేతగా తన పేరును ప్రకటించగానే ఆండ్రియా మెజా భావోద్వేగానికి లోనయ్యారు. విశ్వసుందరి కీరిటాన్ని కైవసం చేసుకున్న అనంతరం ఆనందంగా క్యాట్ వాక్ చేశారు. గతంలో జిమెనా నవర్రెటె (2010), లుపిటా జోన్స్ (1991) మిస్ యూనివర్స్ కిరీటాలు అలంకరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook