EU Vaccine Passport: ఈయూ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ వ్యవహారం, ఇండియా - ఈయూ మధ్య పెరుగుతున్న వివాదం

EU Vaccine Passport: యూరోపియన్ యూనియన్ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ విషయంలో వివాదం రాజుకుంటోంది. వ్యాక్సిన్లను అనుమతించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని యూరోపియన్ యూనియన్‌కు హెచ్చరించింది కేంద్రం. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 1, 2021, 10:18 AM IST
  • యూరోపియన్ యూనియన్ వ్యాక్సిన్ పాస్ పోర్ట్ వ్యవహారంలో పెరుగుతున్న వివాదం
  • కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను అనుమతించకపోతే ఇబ్బందులు తప్పవని ఈయూకు కేంద్రం హెచ్చరిక
  • ఈయూ దేశాల్నించి వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందంటున్న కేంద్రం
EU Vaccine Passport: ఈయూ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ వ్యవహారం, ఇండియా - ఈయూ మధ్య పెరుగుతున్న వివాదం

EU Vaccine Passport: యూరోపియన్ యూనియన్ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ విషయంలో వివాదం రాజుకుంటోంది. వ్యాక్సిన్లను అనుమతించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని యూరోపియన్ యూనియన్‌కు హెచ్చరించింది కేంద్రం. 

యూరోపియిన్ యూనియన్ (Europian Union)ఇండియా మధ్య వివాదం రాజుకుంటోంది. వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ విషయంలో ఈయూ నిబంధనలపై కేంద్రం సీరియస్ అయింది. ఈయూ దేశాలకు లేదా సభ్యదేశాల మధ్య ప్రయాణించేవారికి ఈయూ డిజిటల్ కోవిడ్ సర్టిఫికేట్(Digital Covid Certificate) జారీ చేస్తుంది. డిజిటల్ గ్రీన్‌పాస్ ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తోంది. ఈయూ ఆమోదిత వ్యాక్సన్ల జాబితాలో ఇండియాలో ఉత్పత్తి అవుతున్న కోవాగ్జిన్‌తో పాటు కోవిషీల్డ్‌కు కూడా అనుమతి లేకపోవడంతో భారత ప్రయాణీకులకు ఇబ్బంది ఎదురవుతోంది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలన్న సీరమ్ ఇనిస్టిట్యూట్ అభ్యర్ధనకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

తక్షణం రెండు వ్యాక్సిన్లకు అనుమతివ్వాలని..లేకుంటే ఈయూ దేశాల్నించి వచ్చే ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పవని ఇండియా హెచ్చరించింది. ఆ ప్రయాణీకుల వ్యాక్సిన్ పాస్‌పోర్ట్‌(Vaccine Passport)లను అనుమతించమని..కఠినమైన క్వారంటైన్ నిబంధనల్ని అమలు చేయాల్సి ఉంటుందని ఈయూకు పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌(Covaxin)లకు అనుమతిస్తే..క్వారంటైన్ నిబంధనల్ని సడలిస్తామని స్పష్టం చేసింది. కనీసం కోవిషీల్డ్‌కైనా అనుమతివ్వాలని వచ్చిన విజ్ఞుప్తుల్ని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ(Europian Medicines Agency)పట్టించుకోలేదు. కేవలం ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, జాన్సన్ వ్యాక్సిన్‌లకే అనుమతిచ్చింది. అదే సమయంలో ఇండియన్ వెర్షన్ కోవిషీల్డ్‌కు అనుమతివ్వలేదు. దాంతో యూరోపియన్ యూనియన్, ఇండియా మధ్య వివాదం పెరుగుతోంది. తాజా పరిణామాలపై యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ స్పందించింది. ఈయూ సభ్య దేశాల మధ్య ఆటంకాల్లేని ప్రయాణం కోసమే గ్రీన్‌పాస్ జారీ చేస్తున్నామని..ఇందులో భాగంగా కొన్ని కంపెనీల వ్యాక్సిన్లకే ఆమోదం లభించిందని తెలిపింది. కోవిషీల్డ్‌(Covishield)ను గ్రీన్‌పాస్ (Green pass)జాబితాలో చేర్చాలన్న అభ్యర్ధన రాలేదని ఈయూ మెడిసిన్స్ ఏజెన్సీ చెప్పడం గమనార్హం.

Also read: Alert in Jammu: జమ్ములో పటిష్ట చర్యలు, యాంటీ ద్రోన్ వ్యవస్థ, జామర్ల ఏర్పాటు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News