Union Cabinet Extension: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు కసరత్తు పూర్తి, త్వరలో ప్రకటన

Union Cabinet Extension: కేంద్ర మంత్రిమండలి విస్తరణ జరగనుంది. మంత్రివర్గ విస్తరణకు కసరత్తు దాదాపుగా పూర్తయింది. ఇప్పటికే కొందరు ఎంపీలకు అందుబాటులో ఉండాల్సిందిగా సంకేతాలందాయి. మరో 25 మందితో మంత్రివర్గం విస్తరించే అవకాశాలున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 6, 2021, 11:25 AM IST
Union Cabinet Extension: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు కసరత్తు పూర్తి, త్వరలో ప్రకటన

Union Cabinet Extension: కేంద్ర మంత్రిమండలి విస్తరణ జరగనుంది. మంత్రివర్గ విస్తరణకు కసరత్తు దాదాపుగా పూర్తయింది. ఇప్పటికే కొందరు ఎంపీలకు అందుబాటులో ఉండాల్సిందిగా సంకేతాలందాయి. మరో 25 మందితో మంత్రివర్గం విస్తరించే అవకాశాలున్నాయి.

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం(NDA Government)రెండోసారి కొలువుదీరిన తరువాత రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపధ్యంలో మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన కసరత్తు పూర్తయింది. కొందరు ఎంపీలకు అందుబాటులో ఉండాల్సిందిగా సూచనలందాయి. ప్రధాని నరేంద్ర మోదీ(Pm Narendra modi) సహా ప్రస్తుతం ఉన్న 54 మందికి అదనంగా మరో 25 మందిని చేర్చుకోనున్నారు. ప్రస్తుతం స్వతంత్ర హోదా, సహయమంత్రి నిర్వహిస్తున్న మంత్రులకు కేబినెట్ ర్యాంకు దక్కవచ్చు.అదనపు శాఖల్ని కొందరు మంత్రుల్నించి తప్పించే అవకాశాలున్నాయి. దాదాపు ఏడుగురు మంత్రులపై వేటు పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 

మంత్రివర్గ విస్తరణ (Union Cabinet Extension) తుది రూపుకు రావడంతో ఇవాళ జరగాల్సిన మంత్రివర్గ భేటీ రద్దయినట్టు సమాచారం. మంత్రివర్గ భేటీ ఒకవేళ కొనసాగినా..కొత్త మంత్రివర్గాన్ని కూడా ఇవాళ లేదా రేపు ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. అస్సాం మాజీ ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొందరు ఎంపీలకు మంత్రివర్గంలో అవకాశం లభించనుందని సమాచారం. 

Also read: India COVID-19 Cases: ఇండియాలో 111 రోజుల కనిష్టానికి దిగొచ్చిన కరోనా పాజిటివ్ కేసులు, ఫలితాన్నిస్తున్న కోవిడ్19 టీకాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News