Ganga Declared Covid-19 Free: ఈ ఏడాది మే నెలలో ఇండియాలో కరోనా కేసులు, మరణాలు అధికం కావడంతో యమునా మరియు గంగా నదీతీరాలలో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు తేలియాడుతూ కనిపించడం తెలిసిందే. SARS-CoV2 వైరస్ గంగ మరియు యమునా నదులలో కలిసిందని, నీటి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రజలు ఆందోళన చెందారు.
బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి మరియు సాహ్నీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పేలియోసైన్సెస్ శాస్త్రవేత్తలు దాదాపు రెండు నెలలపాటు అధ్యయనం జరిపి శుభవార్త చెప్పారు. గంగా నదిలో ఎలాంటి కోవిడ్19 వైరస్ (Corona Positive Cases) లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్, లక్నోలోని గోమతి నదిలో కరోనా ఆనవాళ్లను గుర్తించినట్లు తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్‌లో తొలిసారి గోమతి నదిలో కరోనా వైరస్ ఆనవాళ్లు గుర్తించగా, ఈ ఏడాది మే నెలలో మరోసారి ఇదే నిర్ధారణ అయింది. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు మే 15 నుంచి జులై 3 వరకు ప్రతి వారం రెండు శాంపిల్స్ తీసుకుని పరీక్షలు నిర్వహించారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబే ఈ వివరాలు తెలిపారు. గంగా నదిలో సేకరించిన శాంపిల్స్‌కు ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించగా వాటి ఆర్‌ఎన్‌ఏలలో కరోనా ఆనవాళ్లు కనిపించలేదని స్పష్టం చేశారు.
Also Read: Corona Positive Cases: ఇండియాలో క్రమంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
గోమతి నది తీరంలో దొరికిన ఆనవాళ్లు సేకరించి వాటికి కోవిడ్19 (COVID-19) నిర్ధారణ పరీక్షలు చేయగా కరోనా ఉన్నట్లు గుర్తించారు. గంగా నదిలో ఏదో తెలియని విషయం ఉందని, ఆ లక్షణాల కారణంగా వీటికి కరోనా సోకలేదని బీహెచ్‌యూ న్యూరోసైసెన్స్ ప్రొఫెసర్ వీఎన్ మిశ్రా అభిప్రాయపడ్డారు. గుజరాత్, అహ్మదాబాద్‌లోని సబర్మతి నదిలో కొన్ని శాంపిల్స్ సేకరించి గాంధీనగర్ ఐఐటీ నిపుణులు కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు చేయగా వైరస్ ఉన్నట్లు తేలింది. కాంక్రియా మరియు చందోలా సరస్సులలో సేకరించిన శాంపిల్స్ పరీక్షించగా వాటిలోనూ కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు.
Also Read: COVID-19 Delta Variant: డెల్టా వేరియంట్ ప్రమాదకరమే, కరోనా టీకాల ప్రభావం అంతంతమాత్రమే
మానవ వ్యర్థాల సైతం కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని, వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఇదివరకే ప్రకటన జారీ చేసింది. అమెరికాకు చెందిన సీడీసీ మాత్రం సముద్రాలు, సరస్సులలోని నీటి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేదని చెప్పారు. ఈ విధంగా కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని సైతం సీడీసీ పేర్కొంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సైతం నీటి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందనేది కేవలం వదంతులు మాత్రమేనని, అధ్యయనాలలో ఈ విషయాన్ని తేల్చలేదని గతంలోనే స్పష్టం చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook