Horoscope Today 13 July 2021: జులై 13వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
మేష రాశి
మీరు ఈ రోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. వ్యాయామం, ఎక్సర్సైజ్ లాంటి శారీరక శ్రమ చేయాలని భావిస్తారు. మీ పట్టుదల, కృషి వల్ల విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ తల్లిదండ్రుల నుండి కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈ రోజు మీరు ఎక్కువ సమయాన్ని మీ తోబుట్టువులతో గడుపుతారు.
వృషభ రాశి
అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అనవసర వస్తువులకు డబ్బు ఖర్చు చేసే ముందు మీరు రెండుసార్లు ఆలోచించాలి.
మీ బలమైన సంకల్ప శక్తి ఈ రోజు కార్యాలయంలోని సమస్యలను అధిగమించడానికి మీకు సహాయం చేస్తుంది. మీ పిల్లల కోసం ఇంట్లో కొత్తవి నిర్మించడానికి సిద్ధపడతారు. కొన్ని విషయాలలో గొడవలు తలెత్తుతాయి.
Also Read: Jyeshtha Purnima 2021 puja, remedies: జ్యేష్య పూర్ణిమ నాడు ఈ పూజ చేస్తే వ్యాపారంలో లాభాలు
మిథున రాశి
గత కొంతకాలం నుంచి నెలకొన్న గజిబిజి పరిస్థితులు ఇప్పుడు దారికి వస్తున్నాయి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రస్తుతం ప్రయాణాలు చేయడం అంత శుభకం కాదు. విద్యార్థులు ఉన్నత చదువుల ప్రణాళికను ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. వ్యాపారులు, ఉద్యోగులు శక్తివంచన లేకుండా పనిచేస్తారు.
కర్కాటక రాశి
ఉదర సంబంధిత కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. డీహైడ్రేషన్‌కు లోనవకుండా పళ్ల రసాలు, నీళ్లు తరచుగా తీసుకోవాలి. కుటుంబం మిమ్మల్ని మరియు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. పని కచ్చితంగా అవసరమవుతుంది. విరామం తీసుకోకుండా ఇంటి నుండి పని చేయాల్సి ఉంటుంది.
సింహ రాశి
స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టాలని భావిస్తారు. అయితే ఈ రోజు మీ వ్యాపారంలో ఎక్కువ మూలధనాన్ని పెట్టుబడితో ప్రయోజనం ఉంటుందని భావిస్తారు. పని విషయంలో మీ బంధువుల భాగస్వామ్యం చేయవద్దని కొందరు సలహా ఇస్తారు. ఉద్యోగులకు పని భారం తగ్గుతుంది.
Also Read: Sai Baba madhyana aarati lyrics: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్
కన్య రాశి
మీరు మీ పనిని మరే రోజు కంటే ఎక్కువగా ఆనందిస్తారు. మీ స్నేహితుల మధ్య మీ సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది. మీ తండ్రి నుండి వచ్చిన కాల్ కొన్ని శుభవార్తలను తెస్తుంది. అయితే, అధిక పనిభారం కారణంగా, మీరు కుటుంబ కార్యక్రమానికి హాజరు కాలేకపోవచ్చు.
తులా రాశి
ఈ రోజు పిల్లల విద్య ఇంట్లో ఒక ముఖ్యమైన అంశం అవుతుంది. మీరు ఒక చిన్న పని సంబంధిత యాత్రను కూడా ప్లాన్ చేయవచ్చు. ఉద్యోగంలో సంతృప్తి చెందుతారు. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం యోగా దిశగా అడుగులు వేస్తారు. మీ భాగస్వామితో కొంత ఘర్షణను తలెత్తవచ్చు.
వృశ్చిక రాశి
చుట్టూ ఉండే కొందరు మీ సహనాన్ని పరీక్షిస్తారు. పనిలో తలెత్తే పరిస్థితులు మిమ్మల్ని ఆగ్రహానికి గురిచేస్తాయి. మీరు ఒత్తిడిని ఎదుర్కొని పనిచేయగలరని ఉన్నతాధికారులకు నిరూపిస్తారు. వ్యాపారులు పెట్టుబడులు పెట్టడానికి నేడు అంత శ్రేయస్కరం కాదు. విద్యార్థులు ఉన్నత చదువులు, ఉద్యోగాలు ఏం కావాలో తేల్చుకునేందుకు కొంత సమయం కేటాయిస్తారు.
Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే
ధనుస్సు రాశి
మీరు మరియు మీ జీవిత భాగస్వామి ఇల్లు మార్పు లేదా కొత్త ఇల్లు కొనుగోలు గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించడానికి కొంత సమయం కేటాయిస్తారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మీరు గతంలో చేసిన పెట్టుబడుల నుండి లాభాలు అందుకుంటారు. పనిలో మీ సత్తా ఏంటో చూపిస్తారు.
మకర రాశి
కొంత కాలం నుంచి ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కొంతకాలం నుంచి ఎదురుచూస్తున్న డబ్బు తిరిగి చేతికి వస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది.
కుంభ రాశి
ఈ రోజు ఇంట్లో ఒక ముఖ్యమైన రోజు కానుంది. మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో సరదాగా సమయాన్ని గడుపుతారు. విద్య మరియు ఉద్యోగాల పరంగా కొన్ని శుభవార్తలు అందుతాయి. బంగారం, ఏదైనా ఆభరణాలను కొనుగోలు చేయాలని భావిస్తారు. కొన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి.
మీన రాశి
విద్యార్థులు చదువు విషయంలో ఆసక్తి చూపించారు. మీరు చాలా అసహనానికి లోనవుతారు, ఇది మీ ఉద్యోగానికి ఆటంకం కలిగిస్తుంది. అవసరమైతే పని నుంచి కొంత విరామం తీసుకోవాలి. పాత బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook