Simple One Electric Scooter: ఓలాకు పోటీగా 'సింపుల్ వన్' ఈ-స్కూటర్ లాంచ్...ఫీచర్స్ అదుర్స్..ధర ఎంతో తెలుసా?

Simple One Electric Scooter: ఓలా స్కూటర్ కు పోటీగా సింపుల్ వన్ సంస్థ తన మెుదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ను ధర రూ.1.10లక్షల(ఎక్స్-షోరూమ్, సబ్సిడీలను మినహాయించి) వద్ద విడుదల చేసింది. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 16, 2021, 02:48 PM IST
  • మార్కెట్లోకి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్
  • స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల
  • రూ. 1,947 ధరతో బుకింగ్ చేసుకునే అవకాశం
Simple One Electric Scooter: ఓలాకు పోటీగా 'సింపుల్ వన్' ఈ-స్కూటర్ లాంచ్...ఫీచర్స్ అదుర్స్..ధర ఎంతో తెలుసా?

Simple One Electric Scooter: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో పోటీ పెరిగింది. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఓలా(OLA) కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి పోటీగా బెంగుళూరు ఆధారిత కంపెనీ సింపుల్ వన్(Simple One) సంస్థ కూడా ఈ-స్కూటర్ ను విడుదల చేసింది. అయితే దీని ధర రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, సబ్సిడీలను మినహాయించి)గా నిర్ణయించింది. 

రూ. 1,947 ధరతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌(E-Scooter)ను బుకింగ్‌(Booking) చేసుకోవచ్చంటూ ఈ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయితే ఈ బుకింగ్ ఎమౌంట్‌ను రీఫండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ తమిళనాడు(Tamilnadu)లోని హోసూర్‌లోని EV మేకర్స్ ప్లాంట్‌లో తయారు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్లాంట్‌ సంవత్సరానికి ఒక మిలియన్ వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉందంట. కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, గోవా, ఉత్తర ప్రదేశ్‌తో సహా మొదటి దశలో దేశవ్యాప్తంగా మొత్తం 13 రాష్ట్రాలలో ఈ-స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

Also Read: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ విడుదల.. ఫీచర్స్ అదుర్స్..ఒక్కసారి ఛార్జ్ చేస్తే 181కి.మీ!

అదిరిపోయే ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 4.8 kWh పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ఏర్పాటు చేశారు.  ఈ బ్యాటరీని మార్చుకునే సదుపాయం కూడా కల్పించారు. అలాగే పోర్టబుల్‌గా ఉండి మన ఇంటి వద్ద కూడా ఛార్జ్ చేసుకునే అవకాశం కల్పించారు. సింపుల్ లూప్ ఛార్జర్‌తో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌(Simple One Electric Scooter)ను 60 సెకన్ల వ్యవధిలో 2.5 కిమీ రేంజ్ వరకు ఛార్జ్ చేయవచ్చు.  EV కంపెనీ రాబోయే ఏడు నెలల్లో దేశవ్యాప్తంగా 300 కంటే ఎక్కువ పబ్లిక్ ప్లేస్‌లలో ఫాస్ట్ ఛార్జర్‌లను కూడా ఇన్‌స్టాల్ చేయనున్నట్లు సమాచారం.

ఈ-స్కూటర్(E-Scooter) సింగిల్ ఛార్జ్‌లో ఏకో మోడ్‌లో 203 కిలోమీటర్లు.. ఇండియన్ డ్రైవ్ సైకిల్ (IDC) మోడ్‌లో 236 కి.మీ. దూసుకపోతుంది. దీని గరిష్ట వేగం 105 kmph.  అలాగే ఇది 3.6 సెకన్లలో 0 నుంచి 50 kmph, 2.95 సెకన్లలో 0 నుంచి 40 kmph వరకు వెళ్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంది. మిడ్ డ్రైవ్ మోటార్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఇది 12-అంగుళాల వీల్స్, 7-అంగుళాల డిజిటల్ డాష్‌బోర్డ్, ఆన్-బోర్డ్ నావిగేషన్, జియో-ఫెన్సింగ్, SOS మెసేజ్, డాక్యుమెంట్ స్టోరేజ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌తోపాటు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అనేక  ఫీచర్లు(Features) అందుబాటులోకి ఉండనున్నాయి. ఇది ఎరుపు, తెలుపు, నలుపు, నీలం అనే నాలుగు రంగుల్లో విడుదల చేయనున్నారు.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News