India on Afghan Issue: ఆఫ్గనిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫ్గన్ పరిణామాల నేపధ్యంలో దేశాలన్నీ వ్యూహాలు మార్చుకోవల్సి వస్తోందన్నారు.
తాలిబన్లు..ఆఫ్గనిస్తాన్‌ను(Afghanistan)స్వాధీనం చేసుకున్న తరువాత ఏర్పడిన పరిస్థితులపై ప్రపంచదేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్(Rajnath Singh) కూడా అక్కడి పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు.తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించిన తరువాత అక్కడి పరిస్థితులు అందరికీ సవాలుగా మారాయన్నారు. ఈ పరిస్థితుల్లో చాలా దేశాలు తమ వ్యూహాల్ని మార్చుకోవల్సి వచ్చిందని తెలిపారు.తమిళనాడులోని వెల్లింగ్టన్ డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆఫ్ఘన్ పరిణామాలతో భారత వ్యూహం మారిందని చెప్పారు. ఈ విషయంపై పునరాలోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం(Central government)త్వరలో కొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తుందన్నారు.
మరోవైపు పాకిస్తాన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.పొరుగుదేశం ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేయడం, శిక్షణ ఇవ్వడం చేస్తూ ఇండియాపై ఉసిగొల్పుతోందన్నారు.ఇండియా-పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రస్తుతం శాంతియుత వాతావరణం ఉందని..ఇండియా రక్షణాత్మక వైఖరి వీడి ప్రతిస్పందించడమే దీనికి కారణమన్నారు.భారత్ అనుసరిస్తున్న కొత్త వ్యూహాలకు అనుగుణంగానే క్వాడ్ ఏర్పడిందని గుర్తు చేశారు. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ బాటిల్ గ్రూప్ ఏర్పాటు పరిశీలనలో ఉందన్నారు. ఈ విభాగం..వేగంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు యుద్ధ విభాగాల్ని సిద్ధం చేసి శత్రువులపై విరుచుకుపడతాయన్నారు.
Also read: Kabul Blast: కాబూల్ విమానాశ్రయంలో మరోసారి పేలుడు, ఇద్దరి మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook