పాక్ మాజీ క్రికెటర్, తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ నిఖా కార్యక్రమం చాలా నిరాడంబరంగానే జరగడం గమనార్హం. తనకు ఆధ్యాత్మిక విషయాల్లో సలహాదారుగా వ్యవహరించిన బుష్రా మనేకా అనే ఆమెను ఇమ్రాన్ పెళ్లి చేసుకోవడం విశేషం. ఇమ్రాన్‌కు ఇప్పటికే రెండు సార్లు వివాహం జరిగింది. తొలి భార్య గోల్డ్ స్మిత్ ద్వారా తనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఇక 2015లో ఓ టీవీ యాంకర్ని వివాహమాడిన ఇమ్రాన్ ఖాన్, దాదాపు పది నెలలు ఆమెతో కాపురం చేసి ఆ తర్వాత విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వివాహమాడిన బుష్రా మనేకాకు కూడా ఈ వివాహం రెండవ పెళ్లి కావడం గమనార్హం. మొదటి భర్త ద్వారా ఆమెకు అయిదుగురు పిల్లలు కూడా ఉన్నారు. పైగా ఆమె వయసు 40 ఏళ్లు పైమాటే. 1992 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ జట్టును విజయపథంలో నడిపించిన సారధి ఇమ్రాన్ ఖాన్. క్రికెటర్‌గా రిటైర్ అయ్యాక.. ఆయన క్రియాశీలక రాజకీయవేత్తగా ఎదిగారు.
Wishing Chairman @ImranKhanPTI and his wife a happy married life . May Allah bless the couple. #MubarakImranKhan pic.twitter.com/BYHQ9CCaA8
— PTI (@PTIofficial) February 18, 2018