Giant Python Swallows Whole Deer: రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలో జింకను (Deer) సజీవంగా మింగేసిన పెద్ద కొండచిలువకు సంబంధించిన షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన బుధవారం ఉదయం కిషన్‌గంజ్(Kishan Ganj)- లాలాపురా (Lalapura) ప్లాంటేషన్ మధ్య గల అటవీ ప్రాంతం వద్ద కొండచిలువ జింకను వేటాడింది. 34 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో 8 అడుగుల పాము జింకను నోటితో పట్టుకున్న క్రమంగా మింగేయటం మనం చూడవచ్చు.
జింకను పూర్తిగా మింగిన తరువాత కొండచిలువ (Giant Python) వెంటనే వెళ్లిపోయిందని గ్రామస్తులు తెలిపారు. సంఘటన సమయంలో, అటవీ శాఖకు చెందిన కొందరు అధికారులు (Forest Officers) అక్కడే ఉన్నారు మరియు ఈ దృశ్యం మొత్తాన్ని తమ మొబైల్ కెమెరాలో రికార్డ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతుంది.
Also Read: Oil Purify Test: మీరు వాడే వంట నూనె నిజంగా స్వచ్చమైనదా..? ఇలా తెలుసుకోండి..!
विशालकाय अजगर ने हिरण को दबोचा, फिर हुआ ये हाल...#ViralVideo pic.twitter.com/6WMeXw4nVZ
— alkesh kushwaha (@alkesh_kushwaha) September 15, 2021
దట్టమైన అడవి అడవి ప్రాంతాన్ని కలిగి ఉన్న కిషన్‌గంజ్ (Kishan Ganj) లో క్రూరమైన జంతువులు అక్కడ తరచుగా కనిపిస్తుంటాయి. జింకలు (Deers), కొండచిలువలు (Pythons), ఎలుగుబంట్లు(Dears) సహా ఇతరేతర జంతువులను మనం బారన్ జిల్లాలో చూడవచ్చు
కుందేలు లేదా ఎలుకలు వంటి చిన్న చిన్న జంతువులను పాములు మింగే వీడియోలు సర్వసాధారణం. కానీ, పెద్ద జింకను కొండచిలువ చుట్టుముట్టి దానిని పూర్తిగా మింగేయటం చాలా అరుదనే చెప్పవచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్ల ఆశ్చర్యానికి గురవతున్నారు. దానికన్నా ముందు కొండచిలువకు ఉన్న జీర్ణ వ్యవస్థ మరియు దానికి ఉన్న జీర్ణ సామర్థ్యం గురించి చర్చ మొదలైంది.
Also Read: PM Modi's Birthday: వ్యాక్సిన్ పంపిణీ లో భారత్ రికార్డ్... 6 గంటల్లో కోటి వ్యాక్సిన్ డోసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook