Telangana RTC: తెలంగాణ ఆర్టీసీ సరికొత్త సేవల్ని ప్రారంభిస్తోంది. దసరా పండుగ వేళ ప్రయాణీకుల కోసం ఇంటి వద్దకే బస్సు సేవలు అందించనుంది. ఫోన్ చేస్తే ఇంటికే బస్సులు వస్తాయిక. ఆశ్చర్యంగా ఉందా. నిజమే మరి.
దసరా ఉత్సవాల్ని పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీసీ కొత్త సేవలకు అంకురార్పణ చేసింది. ఆర్టీసీ(RTC) ప్రయాణీకుల కోసం ప్రత్యేక సేవల్ని ప్రవేశపెట్టింది. ప్రయాణీకుల సౌకర్యార్ధం ఇళ్లు లేదా కాలనీ వద్దకే బస్సుల్ని పంపించేలా ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి వివిధ ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారికి కొన్ని ఫోన్ నెంబర్లు కూడా కేటాయించింది. ఫోన్ చేస్తే చాలు..ఇంటి వద్దకే బస్సులు వచ్చేస్తాయి. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(VC Sajjanar)ఈ కొత్త సర్వీసుల గురించి వెల్లడించారు.
దసరా పండుగ(Dussehra Festival)సందర్భంగా ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ ఆర్టీసీ సంస్థ 4 వేల పైచిలుకు ప్రత్యేక బస్సుల్ని నడపనుంది. పండుగ పురస్కరించుకుని ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలుండటంతో కొత్త సౌకర్యాన్ని అందుబాటులో తీసుకొచ్చింది. వ్యక్తులుగా కాకుండా పెద్ద కుటుంబం లేదా బంధువులంతా ఒకేసారి ఊరికి వెళ్లానుకుంటే..ఇంటి వద్దకే బస్సును పిలిపించుకోవచ్చు. ఒకే ప్రాంతం నుంచి 30 మంది లేదా అంతకంటే ఎక్కువమంది ప్రయాణీకులు ఓ ఊరికి వెళ్లాలనుకుంటే..ఫోన్ చేస్తే చాలు..ఆర్టీసీ బస్సు ఇంటి గుమ్మానికి లేదా చెప్పిన చోటుకు వెళ్లి ఆ ప్రయాణీకుల్ని పికప్ చేసుకుంటుంది. ప్రస్తుతానికి ఈ సేవలు దసరా రోజుల్లో అంటే 9వ తేదీ నుంచి 14 వ తేదీ వరకూ అందుబాటులో ఉంటాయి. కుటంబ సమేతంగా ప్రయాణం చేయాలనుకునేవారు లేదా వలస కూలీలు, విద్యార్ధులకు ఈ సౌకర్యం ఉపయోగపడుతుందని ఆర్టీసీ చెబుతోంది. ఆర్టీసీ బస్సును ఇంటి వద్దకే రప్పించుకోడానికి ప్రయాణీకులు చేయాల్సిందల్లా సంబంధిత నెంబర్లకు ఫోన్ చేసి చెప్పడమే. ప్రయాణానికి 24 గంటల ముందు చెబితే చాలు..కోరిన చోటుకి బస్సు వస్తుంది.(RTC Bus at Your Door step) హైదరాబాద్‌లో ఈ సేవల కోసం ఎంజీబీఎస్, కోఠి, రేతిఫైల్ బస్టాండ్ ఫోన్ నెంబర్లను అందుబాటులో తెచ్చింది. ఈ ప్రయోగం విజయవంతమైతే రానున్న దీపావళి, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా కూడా కొనసాగించనున్నారు. మరోవైపు దసరా సందర్భంగా తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఈ నెల 8 నుంచి 14 వరకూ ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్ని నడపనుంది. ఇతర రాష్ట్రాలకు కూడా ప్రత్యేక బస్సుల్ని ప్రారంభించనుంది. ఈ ఏడాది 4 వేల 35 అదనపు బస్సుల్ని నడుపుతున్నట్టు ఆర్టీసీ వెల్లడించింది.
Also read: Bathukamma 2021 festival: బతుకమ్మ పండగ సంబరాలు షురూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి