Australia Covaxin Approval: ఇండియాలో తయారైన కరోనా టీకా కొవాగ్జిన్ కు ఆస్ట్రేలియా ప్రభుత్వం (Australia Covaxin) గుర్తించింది. భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ కొవాగ్జిన్ టీకాను (Covaxin Latest News) అధికారికంగా గుర్తిస్తున్నట్లు సోమవారం ప్రకటన చేసింది. ఈ టీకా రెండు డోసులు తీసుకున్న విదేశీ ప్రయాణికులకు తమదేశంలో ప్రవేశించేందుకు అనుమతి (Australia Covid Vaccine Travel) ఉందని తెలిపింది. ఈమేరకు ఆస్ట్రేలియా ఔషధ, వైద్య పరికరాల నియంత్రణ సంస్థ- థెరపీటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ (TGA) అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకాను ఆస్ట్రేలియా ఇప్పటికే అధికారికంగా గుర్తించింది.
కరోనా వ్యాప్తిని తగ్గించే ప్రభావవంతమైన టీకాల అదనపు సమాచారాన్ని ఇటీవలే సేకరించింది టీజీఏ. ఈ వివరాలను పరిశీలించింన అనంతరం కొవాగ్జిన్ (Covaxin News), చైనా సినోఫార్మ్ అభివృద్ధి చేసిన బీబీఐబీపీ - కరోనా వ్యాక్సిన్లను అధికారికంగా గుర్తిస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికుల వ్యాక్సిన్ స్టేటస్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఇక నుంచి పూర్తి స్థాయిలో కొవాగ్జిన్ టీకా తీసుకున్న 12 ఏళ్లు పైబడిన వారు, బీబీఐబీపీ టీకా తీసుకున్న 18 - 60 ఏళ్ల మధ్య వయస్సుల వారు ఆస్ట్రేలియా వెళ్లవచ్చు. కొవాగ్జిన్ టీకాను భారత్ సహా చాలా దేశాల్లో ఇప్పటికే వినియోగిస్తున్నారు. వ్యాక్సిన్‌ను డబ్ల్యూహెచ్ఓ అధికారికంగా ఆమోదించాల్సి ఉంది. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.
Also Read: Vaccine For Kids: చిన్నారుల కరోనా టీకాకు అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం- 5-11 ఏళ్ల వారికి ఇచ్చేందుకు కసరత్తు!
Also Read: Corona Updates: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కొవిడ్ భయాలు- రష్యా, చైనాలో కొత్త కేసుల కలవరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి