Huzurabad by Poll: ఇది అహాంకారానికి-ఆత్మగౌరవానికి జరిగిన పోరాటం..ఈటెల సంచల వ్యాఖ్యలు

హుజురాబాద్ ఉప ఎన్నికల విజయం తరువత ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు..  అహాంకారానికి-ఆత్మగౌరవానికి జరిగిన పోరాటమని, నా తోలు వలిచి చెప్పులు కుట్టించిన ఋణం తీరదని ఈటెల తెలిపారు.. ఇంకా ఏమన్నారంటే..??

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2021, 03:32 PM IST
  • ఇది కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్రజల విజయం
    నా తోలు వలిచి చెప్పులు కొట్టించిన ఋణం తీరదన్న ఈటెల
    ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానన్న రాజేందర్
Huzurabad by Poll: ఇది అహాంకారానికి-ఆత్మగౌరవానికి జరిగిన పోరాటం..ఈటెల సంచల వ్యాఖ్యలు

This is the Victory of the People of Telangana over KCR's Ego: ఆత్మగౌరవ నినాదంతో హుజురాబాద్ ఉపఎన్నికను (Huzurabad by Elections) ఎదుర్కొన్న ఈటల రాజేందర్... (Etela Rajender) ప్రజలు తనకు పట్టం కట్టడంతో ఆత్మగౌరవ బావుటా ఎగరేసినట్లయిందన్నారు. గొప్ప మెజారిటీతో తనను ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన హుజురాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనిది అన్నారు. ప్రజలు తమ తీర్పుతో టీఆర్ఎస్‌ను (TRS) బొందపెట్టారని అన్నారు.

నా బొమ్మ, నా గుర్తుపై గెలిచాడంటూ తనను గడ్డిపోచలా తీసిపారేసిన కేసీఆర్‌కు ఇప్పుడు తానేంటో అర్థమైందన్నారు. కుట్రలు, కుతంత్రాలు, ఏరులైపారిన మద్యం, రూ.వందల కోట్ల డబ్బును తోసిరాజని... ప్రజలు తనవైపు నిలిచారని అన్నారు. హుజురాబాద్ ప్రజలు తమ గుండెను చించి ఆత్మను ఆవిష్కరించారని... ఇది కేసీఆర్ (CM KCR) అహంకారంపై తెలంగాణ ప్రజల విజయమని పేర్కొన్నారు.

Also Read: Viral Video: దీని హొయలు కాకెత్తుకెళ్లా.. 'క్యాట్ వాక్‌తో' అదరగొట్టేసిన కాకి.. వైరల్ వీడియో

విద్యార్థులు, రైతులు, మహిళలు, కుల సంఘాలు... ఇలా అన్ని వర్గాల వారు తన విజయానికి తోడ్పడ్డారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా వారి రుణం తీర్చుకోలేనిది అన్నారు. హుజురాబాద్ ప్రజలను టీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా... అవేవీ పనిచేయలేదని... ప్రలోభాలను, కుట్రలను ప్రజలు చీల్చి చెండాడారని అన్నారు. ఇన్నేళ్లుగా తమ కళ్ల ముందు ఉన్న బిడ్డను కాపాడుకోవాలన్న హుజురాబాద్ ప్రజల సంకల్పమే తనకు ఉపఎన్నికలో విజయం అందించిందన్నారు.

టీఆర్ఎస్ పార్టీకి (TRS Party) తాను వెన్నుపోటు పొడిచానని ఆరోపించారని... కానీ వాళ్లే తనకు వెన్నుపోటు పొడిచారని ఈటల మండిపడ్డారు. తన చరిత్ర తెరిచిన పుస్తకం లాంటిదని పేర్కొన్నారు. తాను టీఆర్ఎస్ నుంచి బయటకురాగానే బీజేపీ తనను అక్కున చేర్చుకుందని... అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు బీజేపీ (BJP) శ్రేణులంతా తనకు గొప్పగా సహకారం అందించారని... కిందిస్థాయి నేతలు పులిబిడ్డల్లా పనిచేశారని కొనియాడారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ఎప్పటికప్పుడు పరిస్థితులను ఆరా తీస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి (Bandi Sanjay) విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారని తెలిపారు.

Also Read: Bheemla Nayak Update: గెట్ రెడీ ఫర్ దీపావళి ట్రీట్.. సాయంత్రం 'లాలా భీమ్లా' ప్రోమో

దమ్ముంటే తనపై పోటీ చేయాలని హరీశ్ రావు (Harish rao), కేసీఆర్‌లకు (KCR) సవాల్ విసిరితే... వాళ్లు పోటీ చేయకపోగా పిలగాన్ని తనపై పోటీ చేయించారని ఈటల పేర్కొన్నారు. కేవలం రెండు గుంటల భూమి ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్  (Gellu Srinivas Yadav) ఉపఎన్నికలో ఇన్ని కోట్ల రూపాయల డబ్బు ఎలా పంచాడని ప్రశ్నించారు. ఏదేమైనా ప్రజలు ఇచ్చిన తీర్పుతో తన జన్మ ధన్యమైందని.. ప్రజలకు తానిచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News