Bheemla Nayak Update: గెట్ రెడీ ఫర్ దీపావళి ట్రీట్.. సాయంత్రం 'లాలా భీమ్లా' ప్రోమో

ఈ రోజు సాయంత్రం (బుధవారం) 'భీమ్లా నాయక్' సినిమా నుండి వీడియో ప్రోమో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది, మాస్ పోస్టర్ లో అదరగొట్టేసిన పవర్ స్టార్...

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2021, 12:50 PM IST
  • సాంయంత్రం భీమ్లా నాయక్ సినిమా అప్డేట్
  • వీడియో సాంగ్ ప్రోమో విడుదల చేయనున్న చిత్ర యూనిట్
  • మాస్ పోస్టర్ లో అదరగొట్టేసిన పవన్ కళ్యాణ్
Bheemla Nayak Update: గెట్ రెడీ ఫర్ దీపావళి ట్రీట్.. సాయంత్రం 'లాలా భీమ్లా' ప్రోమో

Diwali Update from Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి (Pawan Kalyan- Rana Daggubati Combo) కలిసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్ (Bheemla Nayak).. మలయాళంలో (Malayalam) హిట్ అయిన అయ్యప్పనుం కోషియం (Ayyappanum Koshiyum) సినిమాను తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇందులో బిజు మీనన్ (Bheeju Menon) పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ (Sukumaran) పాత్రలో రానా కనిపించనున్నారు. 

ఎపుడెపుడా అని ఎదురుస్తుతున్న మెగా (Mega Fans) మరియు దగ్గుబాటి అభిమానులకు దీపావళి (Diwali Promo) కానుకగా బుధవారం ఈ సినిమా నుండి ఒక అప్డేట్ రాబోతుందని చిత్ర బృందం ప్రకటించింది.  ఈ రోజు సాయంత్రం 07:02 గం.లకు "లాలా భీమ్లా" (Lala Bheemla) వీడియో సాంగ్ ప్రోమోని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. #LalaBheemla from the jungle of #BheemlaNayakMusic అంటూ మూవీ మేకర్స్ ట్విట్టర్ లో పొస్త్ చేశారు. 

"విడుదల చేసిన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ నుదుటిపై తిలకం పెట్టుకొని... ముందు మందు బాటిల్.... ఇంకా కొన్ని కర్రలతో కూడిన వస్తువులతో ఊర మాస్ లుక్ లో పవన్ పోస్టర్ ఆకట్టుకొంటుంది. "

సాగర్ కే చంద్ర డైరెక్ట్ (Sagar K chandra) చేసిన ఈ సినిమాలో నిత్యా మీనన్ (Nitya Menon), సంయుక్త ఫీమేల్ లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు. భీమ్లా నాయక్ సినిమాను (Bheemla Nayak movie) సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశి నిర్మిస్తుండగా.. థమన్ (Thaman) మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా జనవరి 13 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న తరుణంలో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News