Illigal Affair: అంగన్ వాడిలో రాసలీలలు.. 35 ఏళ్ల మహిళతో 14 ఏళ్ల బాలుడు పరార్

తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 34 ఏళ్ల యువతి 10 వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడితో పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2021, 06:05 PM IST
  • తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో దారుణం
  • కామంతో కళ్లు మూసుకుపోయిన అంగన్ వాడి వంటమనిషి
  • 14 ఏళ్ల బాలుడితో పరార్ అయిన అంగన్ వాడి వంటమనిషి
  • అంగన్ వాడి కేంద్రంలోనే 10వ తరగతి విద్యార్థితో రాసలీలలు
Illigal Affair: అంగన్ వాడిలో రాసలీలలు.. 35 ఏళ్ల మహిళతో 14 ఏళ్ల బాలుడు పరార్

35 Year Old Women Missing With 14 Years Old Boy: కామంతో కళ్లు మూసుకుపోయిన వారికి సమాజం పట్ల గౌరవం ఉండదు.. వారికి ఇతరులు ఏమనుకుంటారో, కుటుంబ గౌరవం ఏమవుతుందన్న పట్టింపులు ఉండవు.. వివాహేతర సంబంధాలకు వావి, వరుసలు, వయసుతో సంబంధం ఏమి ఉండదు. తమిళనాడులో జరిగిన ఒక ఘటన సభ్యసమాజానికి కళంకంగా అనిపిస్తుంది. 34 ఏళ్ల యువతి 10వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల యువకుడితో కనిపించకుండా పోయిన ఘటన తాజగా వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వేళ్తే తమిళనాడులోని తిరువారూర్ అనే జిల్లాలో కూడవాసల్ తాలూకార్ అనే గ్రామంలో రసతి - బాలగురు అనే భార్యాభర్తలు  నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు... వారిలో కొడుకుకి 14 ఏళ్లు, కూతురుకి 13 ఏళ్లు ఉంటాయి. అయితే అదే గ్రామంలో లలితా అనే మహిళ అంగన్ వాడి కేంద్రంలో వంట మనిషిగా పనిచేస్తుంది. లలిత మరియు రసతి - బాలగురు దంపతుల ఇల్లు పక్క పక్కనే కావటంతో.. 14 ఏళ్ల బాలుడు, లలిత ఇద్దరు కలిసి రోజు వస్తూ పోతూ ఉండేవారు. 

Also Read: Deepavali 2021 Safe Tips: 'దీపావళి' రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జాగ్రత్తలు మరవద్దు

ఇద్దరి వయసులో చాలా వ్యత్యాసం ఉండటంతో చూసే వారు కూడా పెద్దగా పట్టించుకోవకపోవటంతో వారికి అదే అవకాశంగా మారింది. ఇద్దరి మధ్య చనువు పెరగటంతో.. ఇద్దరు మధ్య అక్రమ సంబంధానికి దారి తీసింది. 10వ తరగతి చదువుతున్న బాలుడు వయసు 14 ఏళ్లు కాగా.. లలితా వయసు 35 ఏళ్లు.. ఆ బాలుడిని అంగన్ వాడి కేంద్రణకి పిలిపించుకొని రాసలీలలు నడపటం ప్రారంభించింది.   

ఇలా రాసలీలలు కొనసాగుతున్న క్రమంలో ఈ విషయం బాలుడి తల్లి దండ్రులకు తెలిసింది. వెంటనే బాలుడిని అతడి మేనత్త ఇంట్లో ఉండి చదువుకోవాలని.. అక్కడి నుండే స్కూలుకు వెళ్లి అక్కడే ఉండాలని బాలుడి తల్లిదండ్రులు సూచించారు. 

Also Read: Huzurabad by Poll: ఇది అహాంకారానికి-ఆత్మగౌరవానికి జరిగిన పోరాటం..ఈటెల సంచల వ్యాఖ్యలు

అయితే అక్టోబర్ నెల 26 వ తేదీ నుండి బాలుడి కనిపించకపోవటంతో.. తల్లి దండ్రులు పోలీసులను ఆశ్రయించారు. జరిగిందంతా పోలీసులుకు తెలపటంతో ఈ విషయం బయటకి వచ్చింది. మొదటి విచారణలో లలిత-బాలుడు ఇద్దరు కలిసి పారిపోయారని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగవుతున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News