Kamal Haasan: ప్రపంచమంతా ఇప్పుడు డిజిటల్ యుగంగా మారింది. రోజురోజుకూ డిజిటల్ కరెన్సీ ఆదరణ పెరుగుతోంది. విలక్షణ నటుడు కమల్ హాసన్ సైతం ఇప్పుడు ఆ దిశగా పయనిస్తున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
విలక్షణ నటుడు కమల్ హాసన్ 67వ పుట్టినరోజు సందర్బంగా సంచలన ప్రకటన చేశారు. డిజిటల్ కరెన్సీ(Digital Currency) వైపు అడుగులేస్తున్నారు. డిజిటల్ అవతార్ కోసం ఎన్ఎఫ్‌టి ప్లాట్‌ఫారమ్ ఫాంటికోతో జత కలిశారు. సూపర్ కలెక్షన్లతో నాన్ ఫంజిబుల్ టోకెన్స్ లాంచ్ చేయనున్నట్టు కమల్ హాసన్ ప్రకటించచారు. అంతేకాకుండా వర్చువల్ రియాలిటీ స్పేస్‌లో సొంత డిజిటల్ అవతార్‌తో మెటావర్స్‌లో కూడా ఆడుగిడుతున్న తొలి భారతీయుడిగా కమల్ హాసన్ ఖ్యాతి గడించనున్నారు.
విలక్షణమైన కధాంశాలతో సినిమాలు తీసే కమల్ హాసన్ (Kamal Haasan)సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు ఫాంటికో అభయానంద్ కూడా కమల్ హాసన్ వంటి లెజెండ్ తమ ప్లాట్‌ఫారమ్‌లో చేరడం ట్రెండ్ సెట్ చేయడమేననంటున్నారు. లోటస్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా కమల్ హాసన్ ఎన్‌ఎఫ్‌టీలు అందుబాటులో రానున్నాయి. ఫాంటికో గేమ్ ఆధారిత మెటావర్స్ ద్వారా అభిమానులు డిజిటల్ కమల్‌తో ఇంటరాక్ట్ కావచ్చు. అదే విధంగా కమల్ హాసన్ వంటి ఇతర భాగస్వామ్యుల కోసం ఫాంటికో సంప్రదింపులు కొనసాగిస్తోంది.
Also read: Electric Scooter: దేశంలో కారుచౌక ధరకే అందుబాటులో రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook